AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AA 23 Update: ఒక్క ఫోటో.. సోషల్ మీడియాలో సాగుతున్న వందలాది ఊహాగానాలకు తెరదించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పట్టాలెక్కడం లేదని, వాయిదా పడుతోందంటూ రకరకాల రూమర్లు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన స్టైల్లోనే ఫుల్స్టాప్ పెట్టారు. అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫోటోను లోకేష్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, “ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి” అని క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు.. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌లను ట్యాగ్ చేసి ప్రాజెక్ట్ వేగం పుంజుకుందని స్పష్టం చేశారు. ఫోటో చూస్తే ఇద్దరూ సీరియస్‌గా కథా చర్చల్లో మునిగిపోయినట్లు స్పష్టమవుతోంది.
‘పుష్ప’తో పాన్-ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్.. తనదైన రా, రస్టిక్ యాక్షన్ మేకింగ్‌తో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించిన లోకేష్ కనగరాజ్ కలయిక అంటేనే క్రేజ్ వేరే లెవల్. దానికి తోడు అనిరుధ్ ఇచ్చే హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. ఏదేమైనా మాటలతో కాకుండా, ఒక్క పిక్‌తో ప్రాజెక్ట్‌పై ఉన్న సందిగ్ధతను పటాపంచలు చేశాడు లోకేష్. అతి త్వరలోనే ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ కాన్సెప్ట్ లేదా షూటింగ్ షెడ్యూల్‌పై మేకర్స్ నుంచి అదిరిపోయే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తుంది.
Also Read
Interesting updates coming soon 💥💥💥@alluarjun 🔥🔥
@MythriOfficial @anirudhofficial https://t.co/XcycmgMXZX— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 12, 2026
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!