టాలెంటెడ్ హీరో సత్యదేవ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుసగా అప్డేట్స్ ప్రకటిస్తున్నారు మేకర్స్. తాజాగా “తిమ్మరుసు” చిత్రం నుంచి గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. లీగల్ క్రైమ్ థ్రిల్లర్ “తిమ్మరుసు : అసైన్మెంట్ వాలి” చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణ సంస్థలపై మహేష్ కోనేరు, యరబోలు సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సత్యదేవ్ కాంచరన, ప్రియాంక జవల్కర్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.
2019లో వచ్చిన కన్నడ చిత్రం ” బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని “ని రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. 2017లోని కొరియన్ మూవీ “న్యూ ట్రయల్” ఆధారంగా ఇది రూపొందించబడింది. ఈ చిత్రం 21 మే 2021 న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.
Read Also : “ప్లీజ్ కమ్ బ్యాక్” అంటూ ఎల్లో బికినీలో కియారా రచ్చ
ఇక ఆయన నటిస్తున్న మరో చిత్రమైన “గాడ్సే” నుంచి కూడా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సత్యదేవ్ కంటిమీద గాయంతో గన్ పట్టుకుని సీరియస్ గా కనిపిస్తున్నాడు. సత్యదేవ్ కు “బ్లఫ్ మాస్టర్” వంటి హిట్ చిత్రం ఇచ్చిన గోపి గణేష్ గాడ్సే దర్శకత్వం వహిస్తున్నారు. సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ నటి ఐశ్వర్య లక్ష్మి ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సత్యదేవ్ ఈ నెల చివర్లో మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. ఇవేకాక సత్యదేవ్ ఖాతాలో గుర్తుందా శీతాకాలం వంటి పలు విభిన్నమైన చిత్రాలు ఉన్నాయి.