Site icon NTV Telugu

South Cinema : 40 ఏళ్ల తర్వాత సౌత్ ఇండియా నుండి సైలెంట్ ఫిల్మ్

Vijay Sethupathi

Vijay Sethupathi

వర్సటైల్ అంటే విక్రమ్‌లా గుర్తుపట్టకుండా గెటప్ మార్చనక్కర్లేదు సూర్యలా మేకోవర్ కానవసరం లేదు. జస్ట్ కథలో కొత్తదనం, నటనలో వైవిధ్యం చూపించొచ్చని ఫ్రూవ్ చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఏజ్‌కు తగ్గ సినిమాలు చేస్తూ మరో వైపు విలన్స్‌గానూ మెప్పిస్తున్నాడు ఈ స్టార్ హీరో. స్టోరీల్లో ఎక్స్‌పరిమెంట్ చేసే మక్కల్ సెల్వన్..మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఎప్పుడో కాలం చెల్లిపోయిన మూకీ సినిమాను తెస్తున్నాడు.

Also Read : NBK 111: షాకింగ్ న్యూస్.. బాలయ్య- గోపిచంద్ మలినేని సినిమా కథ మారింది..

2021లో సేతుపతి ఎనౌన్స్ చేసిన సెలైంట్ మూవీ గాంధీ టాక్స్. షూటింగ్‌కు కొన్నాళ్ల క్రితమే గుమ్మడికాయ కొట్టేశారు. 2023 ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది కూడా. కానీ థియేటర్లలో రిలీజ్‌కు నోచుకోవడం లేదు. ఇన్నాళ్లకు మాటలు లేని సినిమాకు మోక్షం దక్కంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న గాంధీ టాక్స్ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అరవింద్ స్వామి, అదితిరావ్ హైదరీ, సిద్దార్థ్‌ జాదవ్ కీ రోల్స్ పోషించిన ఈ మూకీ సినిమాకు కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకుడు. కమల్ హాసన్-అమల నటించిన పుష్పక విమానం తర్వాత ఇలాంటి సైలెంట్ మూవీ మరో సౌత్ హీరో, దర్శకుడు చేయలేదు. 1987లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పుష్పక విమానం అప్పట్లో పాన్ ఇండియాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కోటి రూపాయలను కొల్లగొట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు అంటే దాదాపు 40 ఏళ్లకు విజయ్ సేతుపతి ఇలాంటి ప్రయోగానికి రెడీ అయ్యాడు. డబ్బు అనే కాన్సెప్ట్ చుట్టూ తిరగబోతుంది గాంధీ టాక్స్. మరీ ఈ ఎక్స్ పరిమెంట్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే జనవరి ఎండింగ్ వరకు ఆగాల్సిందే.

Exit mobile version