Site icon NTV Telugu

Kollywood : స్టార్ హీరో సినిమాను వెనక్కినెట్టిన సీనియర్ హీరో

Kollywood

Kollywood

కొన్ని సినిమాలు అంతే హడావుడి చేసి బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడతాయి. మరికొన్ని సైలెంట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ సౌండ్ చేస్తాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వచ్చిన సూర్య- కార్తీక్ సుబ్బరాజు రెట్రో, శశికుమార్, సిమ్రాన్ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాలు. భారీ హైప్ తో వచ్చిన రెట్రో తుస్సుమంటే,  కమర్షియల్ ఎలిమెంట్స్, సరైన ప్రమోషన్స్, పాన్ ఇండియా రిలీజ్ లేని టూరిస్ట్ ఫ్యామిలీ కంటెంట్ ఉంటే చాలు ఇవన్నీ అవసరం లేదని ఫ్రూవ్ చేసింది.

Also Read : AAA : హీరో నేనే.. విలన్ నేనే.. తగ్గేదెలా

మే 1న రెట్రోతో పోటీగా వచ్చింది టూరిస్ట్ ఫ్యామిలీ. కేవలం కోలీవుడ్‌లో రిలీజైన ఈ  సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తో  థియేటర్లకు క్యూ కట్టారు ఆడియన్స్. ఇక మండే టెస్ట్ విషయానికి వస్తే రెట్రో బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యింది. వీకెండ్‌లో రూ. 7 కోట్లకు పైగా వసూలు చేస్తే మండేలో జస్ట్ రూ. 2 కోట్లతో సరిపెట్టేసుకుంది. టూరిస్ట్ ఫ్యామిలీ మండే సాలిడ్ కలెక్షసాన్స్ రాబట్టి సూపర్ స్ట్రాంగ్ గా రన్ అయింది.  కామెడీ డ్రామా బాగా పండటంతో టూరిస్ట్ ఫ్యామిలీకి జనాలు కనెక్ట్ అయ్యారు. జస్ట్ పబ్లిక్ టాక్‌తో దూసుకెళుతుండటంతో తమిళనాడులో థియేటర్లను పెంచారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డబ్ చేసే యోచనలో ఓ ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక తెలుగు రైట్స్ రూ. 10 కోట్లకు అమ్ముడయిన రెట్రో భారీ నష్టాలు చూసింది. మొదటి రోజు గుడ్ స్టార్ట్ అందుకున్న రెట్రో ప్లాప్ టాక్ తో రన్ ముగించింది.

Exit mobile version