NTV Telugu Site icon

Mookuthi Amman 2 : బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో లేడీ సూపర్ స్టార్.. దర్శకుడు ఎవరంటే..?

Untitled Design (36)

Untitled Design (36)

వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ డా. ఇషారి కె గణేష్, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలలో ఒకరు. వేల్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్న ‘మూకుతి అమ్మన్ 2’ కోసం తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతారను మరోసారి కథానాయకిగా ఎంపిక చేసారు మేకర్స్. 2020లో  ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘మూకుతి అమ్మన్’ -1 తెలుగులో ( అమ్మోరు తల్లి) గా తీసుకు వచ్చారు మేకర్స్. అటు తమిళ్ఇటు తెలుగులో ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల రిలీజై ఘన  విజయం సాధించిన ‘అరణ్మనై-4’ కు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు, నటుడు సుందర్ సి ‘మూకుతి అమ్మన్ 2’  కు దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటి పార్ట్ కంటే ఈ సెకండ్ పార్ట్ మరింత గొప్ప సినిమా అనుభవాన్ని అందిస్తుందని, అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను ఆకట్టుకునేలా ఉండే ఈ చిత్రాన్ని ‘డివైన్ ఫాంటసీ’ జానర్‌గా వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ రూపొందిస్తోంది.

Also Read : Johnny Master : జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు..

ఇషాన్ సక్సేనా, సునీల్ షా మరియు రాజా సుబ్రమణియన్ నేతృత్వంలో IVY ఎంటర్‌టైన్‌మెంట్, B4U మోషన్ పిక్చర్స్ ద్వారా నిర్మించిన రౌడీ పిక్చర్స్, అవ్ని సినిమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్  మరియు సహ-నిర్మిత సంస్థతో కలిసి వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది.  సుందర్ సి, నయనతార కలయికలో వస్తున్న ఈ  కమర్షియల్  చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా, ఈ చిత్రం అనేక అద్భుతమైన థియేట్రికల్ మూమెంట్స్‌తో ‘మూకుతి అమ్మన్’ పార్ట్ 1 భిన్నంగా, సరికొత్తగా ఉంటుందని యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. మూకుతి అమ్మన్ 2 చిత్రంపై అటు అభిమానులు మరియు తమిళ పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి.

Show comments