“బాహుబలి”కి ఆరేళ్ళు… పిక్ షేర్ చేసిన ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి : ది బిగినింగ్” విడుదలై ఆరు సంవత్సరాలయింది. గత ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 2015 జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పటివరకూ టాలీవుడ్ కు ఉన్న పరిమితులన్నీ తెంచేసి, ఇక్కడ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమా తెరకెక్కించగల సమర్థులు ఉన్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ‘బాహుబలి’ మేనియా ఊపేసింది. ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చించదగిన విషయాన్ని చేశాడు రాజమౌళి.
Read Also : కరీనా, సైఫ్ దంపతుల రెండవ కొడుకు పేరేంటో తెలుసా ?
Also Read
- Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
- South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
- Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ
- Slum Dog Release : పూరీ జగన్నాథ్ 'స్లమ్‌డాగ్' సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
ఇక ప్రభాస్‌తో పాటు ఈ ఎపిక్ ఫాంటసీలో రానా దగ్గుబాటి, తమన్నా, అనుష్క శెట్టి, రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు నటించారు. వీరందరూ కలిసి తెరపై సృష్టించిన మ్యాజిక్కు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. ఈ చిత్రం విడుదలై 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ శనివారం తన సోషల్ మీడియాలో ‘బాహుబలి’కి సంబంధించిన ఓ పిక్ ను షేర్ చేశారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ తెలుగు, తమిళ భాషలలో చిత్రీకరించబడింది. మలయాళం, హిందీలోకి డబ్ చేయబడింది. ఈ చిత్రంతోనే ప్రభాస్ భారీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ మూవీ సృష్టించిన అద్భుతం అనంతరం టాలీవుడ్ పరిస్థితి ‘బాహుబలి’ ముందు, తరువాత అన్నంతగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’, ‘సలార్’, ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్‌తో తలపై కొట్టడంతో భర్త మృతి..
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్‌కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్‌కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!