దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి : ది బిగినింగ్” విడుదలై ఆరు సంవత్సరాలయింది. గత ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 2015 జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పటివరకూ టాలీవుడ్ కు ఉన్న పరిమితులన్నీ తెంచేసి, ఇక్కడ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమా తెరకెక్కించగల సమర్థులు ఉన్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా…