కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’. శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ – రాజులు సంయుక్తంగా నిర్మించారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలోని ‘చూసాలే కళ్లారా’ లిరికల్ వీడియో సాంగ్ తాజాగా 50 మిలియన్ల వ్యూస్ ను దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ రొమాంటిక్ సాంగ్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ ను సిద్ శ్రీరామ్ ఆలపించారు. క్రిష్ణ కాంత్ రాసిన లిరిక్స్, సిద్ శ్రీరామ్ వాయిస్ లో అద్భుతంగా ఉన్న ఈ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్న ‘చూసాలే కళ్లారా’ రొమాంటిక్ లిరికల్ సాంగ్ ను మీరు కూడా మరోసారి వినేయండి మరి.