యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ హీరో గతంలో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీలను వదులుకున్నాడు. ఆయన ఈ హిట్ మూవీలను ఆయన రిజెక్ట్ చేయడంతో అందులో నటించిన వేరే హీరోలకు అది బాగా కలిసొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఇలా జరగడం సర్వసాధారణం. జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించిన ఆ 5 సినిమాలు ఏంటంటే… దిల్, ఆర్య, భద్ర, కిక్, ఊపిరి.
వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా 2003లో విడుదలైన “దిల్” ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇందులో స్టూడెంట్ గా కనిపించడానికి ఎన్టీఆర్ ఇష్టపడలేదట. టాలీవుడ్ లోని మోస్ట్ రొమాంటిక్ మూవీస్ లో ఒకటైన చిత్రం ‘ఆర్య’. ఈ చిత్రంతో అల్లు అర్జున్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇందులో తన నటనకు పలు అవార్డులు సైతం అందుకున్నాడు. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం ముందుగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిందట. కానీ ఆయన ఈ ఆఫర్ ను జారవిడుచుకున్నాడు. ఎమోషనల్ అండ్ లవ్ యాక్షన్ డ్రామా “భద్ర” ఆఫర్ ముందుగా అల్లు అర్జున్ కు వచ్చింది. ఆయన నో చెప్పేయడంతో ఎన్టీఆర్ కు చేరింది. ఆయన కూడా రిజెక్టెడ్ అనేయడంతో చివరగా మాస్ మహారాజ రవితేజ వద్దకు చేరింది. బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ మూవీస్ ఒకటైన “భద్ర” హిట్ కావడమే కాదు పలు భాషల్లో రీమేక్ కూడా అయ్యింది.
Read Also : ఐసీయూ నుంచి సీనియర్ హీరో షిఫ్ట్
రవితేజ కెరీర్ లో బెస్ట్ అనిపించిన మరో క్రేజీ మూవీ “కిక్”. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ కథతో ముందుగా యంగ్ టైగర్ ను కలిశాడట. కానీ అంతకుముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన అశోక్, అతిథి చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడంతో ఎన్టీఆర్ ఈ అవకాశాన్నీ వదిలేశారట. చివరగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ “ఊపిరి”లో కార్తీ పాత్రకు ఎన్టీఆర్ ను అనుకున్నారట. కానీ ఇందులో మాత్రం ఒక ప్రత్యేకమైన సీన్ కారణంగా తారక్ వెనక్కి తగ్గాడట. ఈ చిత్రంలోని ఒక సీన్ లో నాగ్ పాదాలను ఎన్టీఆర్ తాకాల్సి వచ్చిందట. అయితే ఆ సీన్ ను తన అభిమానులు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ పాత్రకు సుముఖత చూపలేదు. ఇక ఆ పాత్రలోకి కార్తీ ఎంటరై మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు. తెలుగునాట ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా యు.ఎస్. బాక్స్ ఆఫీస్ వద్ద 14 వ స్థానంలో నిలిచింది.
