చిన్న సినిమా ‘ఏక్ మినీ కథ’ ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించింది. యువి సంస్థ ఈ సినిమాతో పెద్ద జాక్ పాట్ కొట్టిందంటున్నారు. మేర్లపాక గాంధీ రచనతో కార్తీక్ రాపోలు దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరో. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రద్దా దాస్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాను ఏప్రిల్ 30 విడుదల చేయానుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యం అన్న క్లారిటీ రావడంతో ఓటిటికి అమ్మేసారు. దాదాపు తొమ్మిది కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. అడల్డ్ కామెడీ టచ్ వున్న సబ్జెక్ట్ ఇది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్న ఈ సినిమా ద్వారా నిర్మాతలకు ఎంత లేదన్నా అయిదు కోట్లకు పైగా లాభం ఉంటుందని అంచనా. మే నెలాఖరులో ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందట