Site icon NTV Telugu

Tollywood : సినీ కార్మికుల 4వ రోజు సమ్మె.. నేడు ఛాంబర్ లో కీలక భేటీ

Tollywood

Tollywood

కార్మిక సంఘాల బంద్ కారణంగా టాలీవుడ్ లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినీ కార్మికులకు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. నెడు జరగబోయే సమ్మె వివరాలను ప్రకటించారు ఫెడరేషన్ కార్మికులు.  ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చల జరగనున్నాయి. వేతనాల పెంపు విషయంలో అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తెసుకోవాలని చూస్తున్నారు.  చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్ డి సి చెర్మెన్, నిర్మాత దిల్ రాజు ను కలవనున్నారు ఫెడరేషన్ సభ్యులు. ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డిని కలవబోతున్నారు.

Also Read : Pawan Kalyan : స్పీడ్ స్టార్ పవర్ స్టార్.. ఉస్తాద్ ఆల్మోస్ట్ ఫినిష్

మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవిని కలుస్తామని చెప్పారు ఫెడరేషన్ నాయకులు. చిరంజీవి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నారు ఫెడరేషన్ సభ్యులు. సినీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ రెండు. ఒకటి కార్మికుల వేతనాలు పెంచాలి. రెండు పెంచిన వేతనాలు ఏరోజుకారోజే ఇవ్వాలి. నేడు జరిగే చర్చల్లో నిర్మాతలు పెట్టిన రూల్స్ సవివరంగా తెలుసుకొని డిసైడ్ అవుతాం. పీపుల్స్ మీడియా నిర్మాత విశ్వప్రసాద్ ఇక్కడ స్కిల్స్ లేవు అని చెప్పడం దుర్మార్గం అని అన్నారు ఫెడరేషన్ సభ్యులు. ఫెడరేషన్ సభ్యులు నిన్న నందమూరి బాలకృష్ణను కలిశారు. త్వరలోనే ఈ సమస్యకు పరిస్కారం చేస్తామని బాలయ్య చెప్పారన్నారు. నేడు ఫిలిం ఛాంబర్ తో జరిగే చర్చలతో కార్మికుల సమ్మె పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు ఫెడరేషన్ సభ్యులు. అటు నిర్మాతలు త్వరగా ఈ ఇష్యు క్లియర్ ఐతే షూటింగ్స్ రీ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

Exit mobile version