NTV Telugu Site icon

3Movie4K : ఇదెక్కడి క్రేజ్ రా.. ధనుష్ ‘3’ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే.?

Untitled Design (18)

Untitled Design (18)

టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీలో మరోసారి రిలీజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య పవర్ స్టార్ పవన్ బర్త్ డే కానుకగా విడుదలైన గబ్బర్‌ సింగ్ రికార్డు స్థాయి వసూళ్లు సాదించింది. అలాగే మురారి, సింహాద్రి సినిమాలూ రీరిలీజ్ లో భారీగా వసూళ్లు సాధించాయి. తాజాగా విడుదలైన కొత్త సినిమాల కంటే కూడా రిరిలీజ్ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తున్నాయి.

Also Read : Mathuvadalara2 : మత్తు వదలరా – 2 చూసిన ‘మెగా – సూపర్’ స్టార్స్ ఏమన్నారంటే..?

ఈ కోవలోనే రిలీజ్ అయిన మరో సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. తమిళ స్టార్ హీరో ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన సినిమా కొలవెరి ‘3’. బై పోలార్ డిసార్డర్ చుట్టూ అల్లిన ప్రేమ కథ నేపథ్యంలో 2012లో వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టింది. కానీ ఈ సినిమాలోని వై దిస్ కొలవెరి డి సాంగ్  సెన్సేషన్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాతోనే చిత్ర సీమకు పరిచయం అయ్యాడు. అయితే సెప్టెంబరు 14న ఈ సినిమాను రీరిలీజ్ చేసారు మేకర్స్. చడీ చప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.5 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. నేడు రేపు సెలవలు కావడంతో మరింత కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది.అన్నట్టు ఈ సినిమా గతేడాది రిరీజ్ అయింది. తాజాగా రీ – రీ – రిలిజ్ అయింది

Show comments