ఆ కల నెరవేరి 20 యేళ్ళు: మోహన్ రాజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా. తండ్రి నిర్మాత అయినా… కొడుకు మోహన్ కు మాత్రం మెగా ఫోన్ పట్టుకోవాలని కోరిక. 2001లో తెలుగు సినిమా హనుమాన్ జంక్షన్తో తొలిసారి అతను దర్శకుడయ్యాడు. ఎడిటర్ మోహన్ మీద అభిమానంతో దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సరిగ్గా ఇరవై యేళ్ళ క్రితం ఇదే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఆ ప్రారంభోత్సవం ధూమ్ ధామ్ గా జరిగింది.
తొలిసారి దర్శకుడి హోదాలో మోహన్ రాజా స్టార్ కెమెరా యాక్షన్ అని ఆర్డర్ వేశాడు. ఈ ఇరవై సంవత్సరాల కాలంలో మొత్తం తొమ్మిది చిత్రాలను మోహన్ డైరెక్ట్ చేశాడు. అందులో తన తమ్ముడితో చేసిన రీమేక్సే ఎక్కువ. తొలి సినిమా తెలుగుదే అయినా… ఆ తర్వాత జయంను తమిళంలో తమ్ముడు రవితో రీమేక్ చేశాడు. దాంతో అతను జయం రవిగా మారిపోయాడు. ఆ ఇద్దరి విజయయాత్ర అలా కొనసాగుతూనే ఉంది. విశేషం ఏమంటే… ఇప్పుడు మోహన్ రాజా తన పదో చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు.
Also Read
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
మలయాళ చిత్రం లూసిఫర్కు రీమేక్ అయిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే దీని పూజా కార్యక్రమాలు జరిగాయి. మరో చిత్రం ఏమంటే… మోహన్ రాజా దర్శకత్వం వహించిన తొలి తెలుగు సినిమా కూడా మలయాళ చిత్రం తెన్ కాశి పట్టణంకు రీమేకే! జగపతిబాబు, అర్జున్, వేణు ప్రధాన పాత్రలు పోషించిన ఆ సినిమాలో స్నేహ, లయ హీరోయిన్లుగా నటించారు. ఆ తొలిచిత్రం ఘన విజయం సాధించడంతో ఇక మోహన్ రాజా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలగలేదు. అందుకే అప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు మోహన్ రాజా!
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!