Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Ansh: సినిమా చిన్నదా, పెద్దదా అన్నది ఇప్పుడు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కంటెంట్ నచ్చితే చాలు.. థియేటర్లలో ఎన్ని షోలు ఉన్నా, ఎన్ని పెద్ద సినిమాలు పోటీగా ఉన్నా ప్రేక్షకులు హిట్ కొట్టించేస్తున్నారు. అందుకు ‘హనుమాన్ అంశ్’ మరో ఉదాహరణగా నిలిచింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయింది. మొదటి రోజు రూ.10 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఒక దశలో ఈ సినిమాకు రోజుకు ఉన్న షోలు 250 నుంచి ఏకంగా 25కు పడిపోయాయి. అయినా సినిమా ఆగలేదు, ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తో మూడో వారం నుంచి కలెక్షన్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దీంతో ఏకంగా రూ 86 కోట్ల వసూళ్లతో ఇప్పటికీ దూసుకుపోతోంది. త్వరలోనే 100కోట్ల మార్క్ ను కూడా అందుకోబోతోంది. అంతేకాదు నాలుగో వారంలో యష్ నటించిన ‘టాక్సిక్’ను కూడా హిందీ మార్కెట్లో అధిగమించడంతో ఈ సినిమా ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది. అయితే ఇలాంటి హిట్ అందుకున్న తర్వాత దర్శకుడు విశాల్ చతుర్వేది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్లో చర్చకు దారితీస్తున్నాయి.
‘హనుమాన్ అంశ్’ థియేట్రికల్ జర్నీ చూస్తే మొదటి నుంచి దీని ప్రయాణం అంత సులభంగా సాగలేదని అర్థమవుతుంది. భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలోకి రావడంతో ఈ చిన్న సినిమాకి స్క్రీన్లు, షోలు దక్కడం కష్టంగా మారింది. దర్శకుడు విశాల్ చతుర్వేది చెప్పిన వివరాల ప్రకారం, ఒక దశలో సినిమాకు ఉన్న షోల సంఖ్య 250 నుంచి కేవలం 25కి పడిపోయింది. పెద్ద సినిమాలకు ఎగ్జిబిటర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో తమ సినిమాకి థియేటర్లలో చోటు తగ్గిపోయిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు నిలబడటం చాలా కష్టం. కానీ ‘హనుమాన్ అంశ్’ విషయంలో జరిగింది మాత్రం పూర్తిగా భిన్నం. మొదటి రోజు వచ్చిన రూ.10 లక్షల వసూళ్లతో పోలిస్తే ఆ తర్వాత సినిమా సాధించిన వసూళ్లు అసాధారణంగా పెరిగాయి. ప్రేక్షకులు సినిమా గురించి ఒకరికొకరు చెప్పుకోవడం మొదలుపెట్టడంతో మౌత్ టాక్ బలపడింది. ఫలితంగా మొదటి రెండు వారాల్లో నెమ్మదిగా సాగిన సినిమా మూడో వారంలో వేగం అందుకుంది. నాలుగో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా కొనసాగుతూ మొత్తం రూ.86 కోట్లకు చేరుకుంది.
Also Read
- Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
- Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ 'కాకా' లేనట్టేనా..?
- Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
- Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
ఇక్కడే దర్శకుడు విశాల్ చతుర్వేది చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన, సినిమా రిలీజ్ కు ముందు బాలీవుడ్ నుంచి ఆశించినంత సపోర్ట్ లభించలేదని చెప్పుకొచ్చారు. తన సినిమా కోసం కొంతమందిని సహాయం కోరినప్పటికీ, ఆ సమయంలో వారు స్పందించలేదని తెలిపారు. తాను గతంలో సహాయం కోరిన కొందరు వ్యక్తులు అప్పుడు స్పందించకుండా, సినిమా హిట్ తర్వాత అభినందించడానికి ఫోన్లు చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని స్పష్టం చేశారు. మరోవైపు ఈ సినిమా నాలుగో వారంలో యష్ నటించిన ‘టాక్సిక్’ కంటే హిందీలో మెరుగైన ప్రదర్శన ఇవ్వడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ.2 కోట్లతో రూపొందిన ఒక భక్తిరస సినిమా ఇంతటి స్థాయిలో నిలబడటం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.
‘హనుమాన్ అంశ్ ’ కథ కూడా కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా, భక్తులు మహారాజ్ జీగా పిలుచుకునే వ్యక్తి జీవితంతో ముడిపడిన ఆధ్యాత్మిక అంశాలను ఈ సినిమా తెరపైకి తీసుకొచ్చింది. శోభినవ్ సత్య, చందన్ ఆనంద్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. మొదటి రోజు కేవలం రూ.10 లక్షలతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు రూ.86 కోట్ల వసూళ్లకు చేరుకోవడమే కాకుండా, నెక్స్ట్ సీక్వెల్ కి కూడా దారి తీసింది. ఒకప్పుడు రోజుకు 250 షోల నుంచి 25 షోలకు పడిపోయిన సినిమా ఇప్పుడు నాలుగో వారంలోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాకు స్థానం లేదనే వాదనకు ‘హనుమాన్ అంశ్’ తన బాక్సాఫీస్ ప్రయాణంతోనే సమాధానం చెబుతోంది. కంటెంట్‌పై ప్రేక్షకులకు నమ్మకం కలిగితే, మౌత్ టాక్ ఎంతటి చిన్న సినిమానైనా ఎంత పెద్ద విజయంగా మార్చగలదో ఈ మూవీ మరోసారి నిరూపిస్తోంది.
- Tags
- cinema
- Hanuman Ansh
తాజావార్తలు
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
-
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
-
Infinix Hot 70 Pro 5G: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే!
-
SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!