ఆహా
ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ శుక్రవారం తన వీక్షకులకు ఊహించని బహుమతులను అందించింది. ఈ శుక్రవారం మీకు పదిహేను చిత్రాలు ఇస్తున్నాం... లైఫ్‌లో ఎంటర్ టైన్ మెంట్ ఉండాలి కదా
అంటూ సోషల్ మీడియాలో ఆ సినిమాల జాబితాను ప్రకటించింది. విశేషం ఏమంటే… ఆ జాబితాలో పదిహేను కాదు… పదహారు చిత్రాలు ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు, భైరవ ద్వీపం
తో పాటుగా, రాజేంద్ర ప్రసాద్ కొబ్బరి బొండాం, రాజేంద్రుడు - గజేంద్రుడు
, నాని ఈగ
, శ్రీకాంత్ వినోదం
, రాజశేఖర్ వేటగాడు
, అలీ ఘటోత్కచుడు
, నాగచైతన్య యుద్ధం శరణం
, నవీన్ చంద్ర అందాల రాక్షసి
, నాగశౌర్య ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య
, వేణు చిరునవ్వుతో
, అంజలి లీసా
ఇలా మొత్తం 14 చిత్రాలను ఆహాలో శుక్రవారం స్ట్రీమింగ్ చేసింది.
Read Also : “జస్టిస్ ఫర్ బ్రూనో”… స్టార్స్ ఆగ్రహం
దీనికి అదనంగా ఈ శుక్రవారమే యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?
, కన్నడ అనువాద చిత్రం పొగరు
ను వీక్షకుల కోసం అందించింది. పాత కొత్త సినిమాలను కలగలుపుతూ ఒకే రోజు 16 సినిమాలను స్ట్రీమింగ్ చేయడం విశేషమనే చెప్పాలి. సో… మరి కొద్దిరోజుల పాటు థియేటర్లు తెరుచుకోకపోయినా… సినీ అభిమానులకు ఆ లోటు తెలియకుండా ఆహా
చేసింది.