టాలీవుడ్ టాల్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఎస్.ఎస్. రాజమౌళి ఛత్రపతి
చిత్రం హిందీ రీమేక్ ఒకటి కాగా, ధనుష్ నటించిన తమిళ చిత్రం కర్ణన్
తెలుగు రీమేక్ మరొకటి. తనను తెలుగులో హీరోగా పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ను ఛత్రపతి
రీమేక్ తో బాలీవుడ్ లోకి తీసుకెళ్ళాలని సాయి శ్రీనివాస్ అనుకున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను భారీ స్థాయిలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై డా. జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ కు ఊహించని అవరోధాలు ఎదురయ్యాయి. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్‌ను ఏప్రిల్ 22న మొదలు పెట్టాలనుకున్నారు. ఇందుకోసం 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఏకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ సునీల్‌బాబు ఓ విలేజ్ సెట్‌ను ఏర్పాటు చేశారు. ‘రంగస్థలం’ విలేజ్ సెట్‌ను కూడా అప్పట్లో ఇదే లొకేషన్‌లో క్రియేట్ చేశారు. దురదృష్టవశాత్తు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు, లాక్‌డౌన్ వంటి కారణాలతో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ షూటింగ్‌ను అనుకున్న సమయానికి ప్రారంభించలేకపోయారు. ఈ లోపు 3 కోట్ల రూపాయలతో వేసిన సెట్ ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల తాకిడికి తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఈ సెట్‌ను పునరుద్దరించే పనిలో పడ్డారు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు అండ్ కో. ఈ సెట్ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు మేకర్స్.
మరో వైపు తమిళ కర్ణన్
తెలుగు రీమేక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇక్కడ జోర్దార్ గా సాగుతోంది. సో… ముందుగా సింగిల్ షెడ్యూల్ లో కర్ణన్
చిత్రాన్ని పూర్తి చేయాలనే ఆలోచనకు సాయి శ్రీనివాస్ వచ్చాడట. పరిస్థితులు కాస్తంత చక్కబడగానే కర్ణన్
ను పూర్తి చేసి, ఆ పైనే హిందీ ఛత్రపతి
ని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ఈ యేడాది సంక్రాంతికి అల్లుడు అదుర్స్
తో జనం ముందుకు వచ్చిన సాయి శ్రీనివాస్ ఇదే యేడాది అందుకు పూర్తి భిన్నమైన కథాంశంతో, కర్ణన్
లాంటి అర్థవంతమైన సినిమాతో మరోమారు ప్రేక్షకులను పలకరించడం అనేది విశేషమే!