అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. చిరు సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముస్సోరీ షెడ్యూల్ ఫినిష్ చేసారు. అక్కడ చిరంజీవి, కేథరీన్ మరియు నయనతార కాంబినేషన్‌లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కాస్త గ్యాప్ తర్వాత నేటి నుండి ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో సినిమలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే చిరు, నయన్ కు సంబంధించి మేజర్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారట. అలాగే ఇదే షెడ్యూల్ లో విక్టరీ వెంకీ కూడా జయిన్ అవుతారని సమాచారం. సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మాస్ మ్యూజిక్ స్పెషలిస్ట్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అందుకు అనుగుణంగానే షూట్ ను చక చక ఫినిష్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న చిరు – అనిల్ కాంబో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. MEGA 157 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు లిటిల్ కు పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.