Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్

Untitled Design (1)

Untitled Design (1)

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్‌కు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నిన్న స్వయంగా ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్‌కి ఈ సందర్భంగా చిరంజీవి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్‌లో కోలీవుడ్ ఆరాధ్య దైవం, దివంగత మహానేత ఎం.జి.ఆర్ (MGR) పేరును ప్రస్తావిస్తూ చిరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సరిగ్గా ఎంజీఆర్ లాగే నిస్వార్థమైన, ప్రజా రంజక పాలన అందించి, తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని విజయ్‌ను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

మెగాస్టార్ ఆశీస్సులకు సీఎం విజయ్ సైతం ఎంతో ఉద్వేగంగా బదులిచ్చారు. చిరంజీవి లాంటి పెద్దల మాటలు తనకెంతో బలాన్నిస్తాయని తెలుపుతూ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఇదే క్రమంలో వీరిద్దరి మధ్య కాసేపు సినిమాల గురించి కూడా చర్చ జరిగింది. ఇటీవల చిరంజీవి నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రాన్ని తాను వీక్షించానని విజయ్ తెలిపారు. ఆ వయసులో కూడా చిరును వెండితెరపై అంత ఎనర్జిటిక్‌గా చూడటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ఒక సగటు అభిమానిలా తన సంతోషాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం ప్రతిష్టాత్మక KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిరంజీవి తదుపరి సినిమా అఖండ విజయం సాధించాలని తన ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మీడియాకి చిరంజీవి పర్సనల్ పీఆర్ టీం సమాచారం అందించింది.