Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్‌కు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నిన్న స్వయంగా ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్‌కి ఈ సందర్భంగా చిరంజీవి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్లో కోలీవుడ్ ఆరాధ్య దైవం, దివంగత మహానేత ఎం.జి.ఆర్ (MGR) పేరును ప్రస్తావిస్తూ చిరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సరిగ్గా ఎంజీఆర్ లాగే నిస్వార్థమైన, ప్రజా రంజక పాలన అందించి, తమిళనాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని విజయ్ను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
మెగాస్టార్ ఆశీస్సులకు సీఎం విజయ్ సైతం ఎంతో ఉద్వేగంగా బదులిచ్చారు. చిరంజీవి లాంటి పెద్దల మాటలు తనకెంతో బలాన్నిస్తాయని తెలుపుతూ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఇదే క్రమంలో వీరిద్దరి మధ్య కాసేపు సినిమాల గురించి కూడా చర్చ జరిగింది. ఇటీవల చిరంజీవి నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రాన్ని తాను వీక్షించానని విజయ్ తెలిపారు. ఆ వయసులో కూడా చిరును వెండితెరపై అంత ఎనర్జిటిక్‌గా చూడటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ఒక సగటు అభిమానిలా తన సంతోషాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం ప్రతిష్టాత్మక KVN ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న చిరంజీవి తదుపరి సినిమా అఖండ విజయం సాధించాలని తన ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మీడియాకి చిరంజీవి పర్సనల్ పీఆర్ టీం సమాచారం అందించింది.
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
తాజావార్తలు
-
Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
ట్రెండింగ్
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!