NTV Telugu Site icon

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా “భోళా శంకర్” ప్రారంభోత్సవం

Bhola-Shankar

Bhola-Shankar

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిరు అయ్యప్ప మాలలో ప్రత్యేక పూజలు చేశారు. మ్యూజిక్ కంపోజర్ మణిశర్మ, దర్శకులు వివి వినాయక్, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ తదితరులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తొలి క్లాప్‌ కొట్టి ఈ చిత్రాన్ని ప్రారంభించారు. వివి వినాయక్ కెమెరా స్విచాన్ చేశారు. అంతకు ముందు ఈ కార్యక్రమానికి హాజరైన కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బాబీ, మలినేని గోపీచంద్, ఎన్ శంకర్, రచయిత సత్యానంద్‌లు చిత్ర స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. ‘భోళా శంకర్’ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుండి ప్రారంభమవుతుంది. “భోళా శంకర్‌”లో చిరు కథానాయికగా తమన్నా నటిస్తుండగా, మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ కనిపించనుంది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘వేదాళం’ మాదిరిగానే భోళా శంకర్” కథ కూడా కోల్‌కతానేపథ్యంలో సాగుతుంది. సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం ఈ ఐకానిక్ సిటీలో జరుగుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించగా, డడ్లీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

Show comments