NTV Telugu Site icon

Megastar Chiranjeevi: చిరు ఇచ్చిన ట్విస్ట్.. కుర్ర వేషాల సీక్రెట్ లీక్

Chiranjeevi Interview

Chiranjeevi Interview

Chiranjeevi Wants To Do Young Roles In His 80s: ఎంత వయసొచ్చినా సరే.. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు కథానాయకుడిగానే సినిమాలు చేస్తుంటారు. యువకుడిలా వెండితెరపై అలరించేందుకు ప్రయత్నిస్తుంటారు. తనకూ అలాంటి కోరికే ఉందని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. తనకు 80 ఏళ్లు వచ్చినా సరే.. యువకుడిలా అలరించాలని అనుకుంటున్నానని, అంత వయసొచ్చినా కుర్ర వేషాలు వేయాలనుందని తెలిపారు. ఇది ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పని రహస్యమని చిరు పేర్కొన్నారు. తన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా.. ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. బాబీ దర్శకత్వంలో తాను చేస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమాలోని కొన్ని స్టిల్స్ చూస్తుంటే.. 1991కి, ఇప్పటికీ తనలో తేడా కనిపించట్లేదని అన్నారు. 30 ఏళ్ల తర్వాత కూడా తనలో అదే జోష్‌ కనిపిస్తోందని, ఈ సినిమాను ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tripti Dimri: ఆ హీరోయిన్ సోదరుడితో తృప్తి డేటింగ్.. నిజమేనంటూ నటి బాంబ్

ఇంకా చిరంజీవి మాట్లాడుతూ.. తాను యువకుడిగా ఉన్నప్పుడు నుంచి డిసెంబర్ 31వ తేదీన అందరిలాగా పార్టీలకు వెళ్లేవాడిని కాదన్నారు. కాలేజీ రోజుల నుంచి పెళ్లైన చాలా రోజుల దాకా.. డిసెంబర్‌ 31న రాత్రి 11.30 నుంచి పూజ గదిలో ఆంజనేయస్వామి ముందు కూర్చుని ధ్యానం చేసుకునేవాడినని, 12 గంటల తర్వాత టపాసుల చప్పుడు విని ధ్యానం నుంచి లేచి అందరికీ శుభాకాంక్షలు చెప్పేవాడినని అన్నారు. ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని తన భార్య సురేఖ కొనసాగిస్తోందన్నారు. తన కుమారుడు రామ్ చరణ్‌ కూడా తనలాగే అందరినీ కుటుంబసభ్యుల్లా ట్రీట్ చేస్తాడన్నారు. కానీ.. చరణ్ చాలా గుంభనంగా, ఓపెన్‌గా ఉంటాడని, ఈ విషయంలో తమకి పోలిక లేదన్నారు. చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయం తెలిసి తాము చాలా సంతోషించామన్నారు. ఇక పవన్ కళ్యాణ్‌పై వస్తోన్న విమర్శలు తనని ఎంతో బాధపెట్టాయన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తన తమ్ముడు పని చేస్తున్నాడని.. కానీ కొందరు మితిమీరి విమర్శలు చేస్తున్నారని, అవి విన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుందన్నారు. రాజకీయాలను ప్రక్షాళన చేసి, ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడన్నారు.

Minister KTR: కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభించిన కేటీఆర్.. మరో 11 ప్రాజెక్ట్స్ త్వరలోనే పూర్తి