తెలంగాణాలో టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీకి మేలు కలిగేలా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. ఈ మేరకు “తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021
సినిమా థియేటర్లకు టిక్కెట్ ధరలను పెంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వులు) జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధరలను తగ్గిస్తూ జిఓలు జారీ చేస్తూ సినిమా థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సినీ పరిశ్రమకు అండగా నిలుస్తోంది. టికెట్ ధరలను పెంచాలన్న టాలీవుడ్ సినీ పరిశ్రమ అభ్యర్థనను ఆమోదించాల్సిందిగా హోంశాఖ అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. అందుకనుగుణంగా జీవో జారీ అయింది. దీని ప్రకారం జీఎస్టీ మినహా ఏసీ థియేటర్లకు కనీస టిక్కెట్ ధర రూ.50, గరిష్టంగా రూ.150గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల కోసం, కనిష్ట ధర రూ. 100+GST, గరిష్టంగా రూ.250+GST. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిక్లైనర్ సీట్లకు, ధర రూ. 200 + జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లలో రూ. 300 + జీఎస్టీ టిక్కెట్‌కు రూ. 5 (ఎసి) మరియు టిక్కెట్‌కు రూ. 3 (నాన్ ఎసి) నిర్వహణ ఛార్జీని వసూలు చేయడానికి థియేటర్లకు అనుమతి ఉంది.