Chiranjeevi – Ram Charan : చిరంజీవి, రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలకు ఫ్యాన్స్ ను ఎప్పుడు ఎలా ఎంటర్ టైన్ చేయాలో బాగా తెలుసు. ఈ మధ్య వరుసగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తమ సినిమాల నుంచి విడుదల చేస్తున్న పాటలతో సోషల్ మీడియా లో సంచలనాలు సృష్టిస్తున్నారు. రీసెంట్ గానే చిరంజీవి నటిస్తున్న “మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా నుంచి వచ్చిన “మీసా పిల్ల” పాట యూట్యూబ్‌లో సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. ఈ సాంగ్‌కు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఎనర్జీ, బీట్‌లు, చిరంజీవి స్టైల్ అన్నీ కలిపి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఈ పాట ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ దాటేసింది.
Read Also : Bollywood : హిట్ కొట్టి రెండేళ్లు.. ఇలా అయితే ఎలా పాప
అలాగే మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన “చికిరి” సాంగ్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. రిథమిక్ బీట్స్, స్టైలిష్ విజువల్స్, చరణ్ డ్యాన్స్, గ్రేస్ ఫ్యాన్స్ ను ఫిదా చేశాయి. కేవలం కొన్ని రోజుల్లోనే ఇది కూడా 50 మిలియన్ వ్యూస్ సాధించింది. మెగా ఫ్యాన్స్ అయితే ఈ డబుల్ సక్సెస్‌పై సంతోషంతో మునిగిపోయారు. “తండ్రి కొడుకులు ఇద్దరూ అదరగొడుతున్నారు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఒకవైపు చిరంజీవి లెజెండరీ ఎనర్జీతో.. మరోవైపు రామ్ చరణ్ యూత్ కరేజ్‌తో మెగా మానియా కొనసాగుతోంది. ఈ ఇద్దరూ 2026లోనే థియేటర్లకు రాబోతున్నారు. మరి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
Read Also : Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ దెబ్బకు కిటికీలోంచి దూకి వచ్చేశా.. సుమ కామెంట్స్
