సీఎం జగన్ తో టాలీవుడ్ బృందం భేటీ ముగిసింది. చిరంజీవి నేతృత్వంలోని బృందం సినిమా టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చలు జరిపారు. సీఎం జగన్ కు సినీ పరిశ్రమ నుంచి 14 విజ్ఞప్తులు అందించిన ఈ బృందం ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా తెలియజేశారు.
Read Also : Live : సీఎం జగన్ తో భేటీ తర్వాత చిరంజీవి టీం ప్రెస్ మీట్
భేటీ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ “ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డు పడిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము… చిన్న సినిమాలకు ఐదవ షోకు అంగీకారం తెలిపారు. సీఎం తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్టుగానే ఆంధ్రాలోనూ అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలూ కన్పిస్తామని చెప్పారు. ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వారికి చెప్పడం జరిగింది. ఈరోజు సహృద్భావంగా ఈ చర్చ ముగిసింది. దానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, పేర్ని నానికి, అలాగే న్యాయబద్ధంగా ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు… హోప్ ఫుల్లీ ఈ నెల మూడవ వారం లోపల జీవో వచ్చే అవకాశం ఉంది… ఎంత తొందరగా జీవో వస్తే అంత తొందరగా సినీ పరిశ్రమ ముందుకు వెళ్తుంది” అని అన్నారు.