Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైనా తన తమ్ముడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆ మాటల్లో ప్రేమ, గౌరవం స్పష్టంగా కనిపిస్తాయి. మనకు తెలిసిందే కదా.. పవన్ కల్యాణ్ కు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనకు ఉన్నంత మంది డై హార్డ్ ఫ్యాన్స్ బహుషా ఇంకెవరికీ ఉండరేమో. అయితే ఇంతటి ఫాలోయింగ్ రావడానికి కారణం ఏంటనే ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్‌ను ప్రజలు హీరోగా మాత్రమే కాదు, వ్యక్తిగా కూడా ఎంతో ప్రేమిస్తారు. ఆయన సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆ అభిమానంలో ఎప్పుడూ తగ్గుదల ఉండదు. ఎందుకంటే పవన్ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆయన ఏం చేస్తే దాన్ని నిజాయితీగా చేస్తాడు. అదే ఆయనకు అభిమానులను తెచ్చిపెట్టింది’ అని చెప్పారు.
Read Also : SSMB 29 : ఫస్ట్ టైమ్ అలాంటి పని చేస్తున్న జక్కన్న.. మహేశ్ ఫ్యాన్స్ టెన్షన్
ఆయన మాటలను బట్టి నిజమే అని తెలుస్తోంది. ఎందుకంటే సినిమాల పరంగా చూస్తే పవన్ కల్యాణ్ కెరీర్ లో చాలా ప్లాపులు ఉన్నాయి. పదేళ్ల దాకా ఒక్క హిట్ లేకపోయినా ఆయన అభిమానులు పెరిగారే తప్ప తగ్గలేదు. సామాన్య ప్రజల సమస్యలపై స్పందించడం, సామాజిక సేవలో ముందుండడం, ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండటం.. తాను హీరోను అనే బిల్డప్ లకు పోకుండా సాదాసీదాగా ఉండటం ఇవే ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను తెచ్చిపెట్టాయి. ఇక రీసెంట్ గానే ఓజీ మూవీతో చాలా ప్లాపుల తర్వాత హిట్ అందుకున్నాడు పవన్. త్వరలోనే హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో రాబోతున్నాడు.
Read Also : The Girlfriend : ‘నీకేం తెలుసు’ అని అమ్మాయిలను అవమానిస్తారు.. రష్మిక కామెంట్స్
