NTV Telugu Site icon

Chiranjeevi : ‘‘లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది.. చరణ్ వారసుడిని ఇవ్వరా’’ వైరల్ అవుతున్న చిరు వ్యాఖ్యలు

New Project (71)

New Project (71)

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అభిమానులకు ఆదర్శప్రాయంగా ఉన్న చిరంజీవి, ఇటీవలే హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బ్రహ్మ ఆనందం’ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ, చిరంజీవి దగ్గరకు వెళ్లి ఆయన తాతగారి ఫోటో చూపించమని అడిగినప్పుడు, చిరంజీవి తన జోక్‌ను పంచుతూ, “ఇంట్లో నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది. నా చుట్టూ మొత్తం ఆడపిల్లలే. చరణ్ ని ఒక్కోసారి అడుగుతుంటాను, దయచేసి ఈసారి ఒక అబ్బాయిని కనురా, మన లేజసీ ని ముందుకు కొనసాగించాలి. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది” అని నవ్వుతూ అన్నారు.

Read Also : Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. జోర్డాన్ రాజుతో ట్రంప్ వ్యాఖ్య

ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో విపరీతమైన విమర్శలకు గురయ్యాయి. నెటిజన్లు, అభిమానులు చిరంజీవి మాటలను తప్పుగా పరిగణిస్తున్నారు. “అబ్బాయి పుట్టాలి” అన్న ఉద్దేశం లో తప్పేమి లేదు..కానీ “ఆడపిల్లలు తమ లేగసీని కొనసాగించలేరు” అనే అభిప్రాయం వేసుకోవడం కొంతమందికి మాత్రం నచ్చడం లేదు. చిరంజీవి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఇలా మాట్లాడిన చిరంజీవి, తన అభిమానులకు మానవీయ విలువలు, సమానత్వం, సానుభూతి చూపించాలి అని చెప్పుకుంటున్నారు. ఈ ఘటనపై చిరంజీవి వివరణ ఇవ్వలేదు, కానీ ఆయన మాటలు అభిమానులలో మిశ్రమ భావాలు కలిగించాయి.

Read Also : EC Meeting: రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం.. ‘నోటా’ తప్పనిసరిపై చర్చ!