‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రస్తుత దర్శకులకు క్లాస్ పీకారు. దర్శకులు తమ తమ స్క్రిప్ట్ లను వారి కోణంలోంచి కాకుండా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడాలని పేర్కొన్నారు. అయితే ఇది ఆయన అందరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించినా అది కొరటాలకు నేరుగా తాకింది అంటున్నారు. ఎందుకంటే ఇటీవల ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ప్రచారంలోనూ కొందరు దర్శకులు బౌండ్ స్క్రిప్ట్ తో రాకుండా సెట్‌లోనే సీన్స్ రాస్తుంటారని అంది కరెక్ట్ కాదని చెప్పారు. అలా చేయడం చాలా తప్పు అని వివరించారు. ఇక నిన్నటి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కొంతమంది దర్శకులు కాంబినేషన్ కుదరిందనే తొందరలో స్క్రిప్ట్ రెడీ కాకుండానే సినిమా చేయడానికి తొందరపడుతున్నారని అన్నారు. రూ 200 పెట్టి సినిమాకి వచ్చే ప్రేక్షకునికి అది నచ్చుతుందా లేదా? అని ఆలోచించటం లేదని, స్క్రిప్ట్‌ను 360 డిగ్రీలో చూడాలని దర్శకులకు సూచించారు. అయితే ఈ సద్విమర్శలు కొరటాల శివకు నేరుగా తాకాయని అంటున్నారు. చిరంజీవి,చరణ్ కలయికలో ‘ఆచార్య’ తీసిన శివ కెరీర్‌లో డిజాస్టర్ అందుకున్నారు.
ఇక చిరంజీవికి సైతం ‘ఆచార్య’ ఫలితం పూర్తి నిరాశను కలిగించింది. మెగాస్టర్ కెరీర్ లోనే అంతడి ప్లాఫ్ ను చవిచూడలేదు. అందుకే ఇలా క్లాస్ ల మీద క్లాస్ లు పీకుతున్నారని అంటున్నారు. అయితే ఆయన మాటల్లో నిజం లేకపోలేదని, అనుభవంతో చెప్పే సలహాను పాజిటీవ్ గా తీసుకుని దర్శకుడు ముందుకు వెళ్ళాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు. దర్శకులు చెప్పిన లైన్ ని గుడ్డిగా నమ్మకుండా పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతే హీరోలు ముందుకు వెళ్ళాలనీ అంటున్నారు. రొటీన్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఇకపై రోజలు చెల్లిపోయాయన్నది ఇటీవల విడుదలైన సినిమాలను గమనిస్తే ఇట్టే అర్థం అవుతుందని గ్రహించాలి. ప్రస్తుతం చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుండగా కొరటాల ఎన్టీఆర్ 30 సినిమాకి రెడీ అవుతున్నారు. మరి వీరిద్దరూ వారి వారి చిత్రాలతో హిట్ కొట్టాలని ఆశిద్దాం.