Chiranjeevi : చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్.. నాగార్జున, వెంకీ హాజరు

  • వైభవంగా చిరు ఇంట వేడుక
  • గెస్టులుగా వచ్చిన వెంకీ, నాగ్
  • స్పెషల్ గిఫ్టులు ఇచ్చిన చిరు
Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. చిరంజీవి సాధారణంగా ఏదైనా ఫెస్టివల్ ను గ్రాండ్ గా తన ఇంట్లో సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా దీపావళి పండుగను తన ఇంట్లోనే సంప్రదాయబద్దంగా సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు నాగార్జున, వెంకటేశ్ వాళ్ల భార్యలతో వచ్చారు. వారికి చిరంజీవి, సురేఖ దీపావళి గిఫ్ట్ లను అందజేశారు. నయనతార కూడా చిరు ఇంటికి వచ్చారు. ఈ ఫొటోలను చిరు స్పెషల్ గా పోస్టు చేశారు.

Read Also : Mana Shankara Vara Prasad Garu : మన శంకర వర ప్రసాద్ గారు మూవీ నుంచి దీపావళి పోస్టర్

ఈ రోజు దీపావళి వేడుకలను నా డియర్ ఫ్రెండ్స్ వెంకటేశ్, నాగార్జునతో జరుపుకోవడం సంతోషంగా ఉంది. నా హృదయం జాయ్ ఫుల్ తో నిండిపోయింది. ప్రేమ, నవ్వులు, జాయ్ తో మా ఇల్లు నిండిపోయింది. ఈ దీపావళి వెలుగులు నింపాలి అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఆయన చేసిన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. మనకు తెలిసిందే కదా చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఈ ముగ్గురూ వాళ్ల ఇళ్లలో ఎలాంటి ప్రోగ్రామ్ జరిగినా తరచూ కలుసుకుంటూనే ఉంటారు.

Read Also : Salman Khan : సల్మాన్ ఖాన్ నోట బలూచిస్థాన్.. నెట్టింట ఒకటే రచ్చ