Ram Charan Hook Step in Chikiri Chikiri Song Set Global Trend: ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఇటీవల ‘చికిరి’ అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట ఊహించని రీతిలో హిట్ అయింది. చరణ్ ఈ సాంగ్‌లో అదిరిపోయే హుక్ స్టెప్ వేశారు. బ్యాట్ పట్టుకుని ఆయన వేసిన హుక్ స్టెప్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. స్పీడ్‌గా వేసిన ఆ స్టెప్.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ప్రస్తుతం ఈ హుక్ స్టెప్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎక్కడ చూసినా చికిరి రీల్సే కనిపిస్తున్నాయి.
కేవలం ఇండియాలోనే కాదు.. గ్లోబల్ లెవల్లో చికిరి సౌండ్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో పెద్ది సినిమా రిలీజ్ అవుతుండగా.. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళంతో పాటు హిందీ భాషల్లో చికిరి సాంగ్ రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అలాగే వెస్ట్రన్ కంట్రీస్‌తో పాటు జపాన్, నేపాల్ లాంటి దేశాల్లో చికిరి సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గ్లోబల్ లెవల్లో ఈసాంగ్‌కు రీల్స్ కనిపిస్తున్నాయి. దీంతో చికిరి రీచ్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇప్పటికే యూట్యూబ్‌లో 60 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ సాంగ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో 70K+ రీల్స్‌తో రచ్చ చేస్తోంది. మొత్తంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చికిరి వైబ్ మామూలుగా లేదనే చెప్పాలి. సాంగ్‌ను మోహిత్ చౌహాన్ ఆలపించగా.. బాలాజీ సాహిత్యం అందించారు.
Also Read: 28 వేల ఫ్లాట్ డిస్కౌంట్, 4 వేల బ్యాంక్ ఆఫర్.. 60 వేల Samsung Galaxy S24 FE ఫోన్ 3 వేలే!
ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న పెద్ది సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చ్ 27న గ్రాండ్‌గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి.
