NTV Telugu Site icon

Charmy Kaur: ఇది చిన్న బ్రేక్ మాత్రమే.. ముందుంది మొసళ్ల పండగ

Charmy Kaur On Jgn

Charmy Kaur On Jgn

Charmy Kaur Reacts On Jana Gana Mana Rumours: నిన్న రాత్రి నుంచి పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండల డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’ సినిమాను రద్దు చేశారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం వల్ల భారీ నష్టాలు మిగిలినందుకే, మేకర్స్ ఆ సినిమా షూటింగ్ ఆపేయాలని నిర్ణయించుకున్నారని వార్తలొస్తున్నాయి. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీ, విజయ్ సహా నిర్మాతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారని.. చివరికి బడ్జెట్ సరిపోదన్న లెక్కలు చూసుకున్నాక, ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేయాలని డిసైడ్ అయ్యారని పుకార్లు షికారు చేశాయి.

ఈ వార్తలపై మాజీ నటి, నిర్మాత చార్మీ స్పందించింది. నేరుగా జన గణ మన సినిమాపై వస్తున్న వార్తల మీద రియాక్ట్ అవ్వలేదు.. జస్ట్ చిల్ గాయ్స్ అంటూ రూమర్స్‌ని నమ్మొద్దని పరోక్షంగా చెప్పింది. ప్రస్తుతానికి తాము చిన్న విరామం తీసుకుంటున్నామని తెలిపింది. అయితే, దాని పక్కనే బ్రాకెట్‌లో ‘సోషల్ మీడియా నుంచి’ అని మెన్షన్ చేసి, కాస్త తికమక పెట్టింది. ‘పూరీ కనెక్ట్స్’ తప్పకుండా బౌన్స్ బ్యాక్ ఇస్తుందని.. ముందుంది మొసళ్ల పండగ అన్నట్టు, ఈసారి అంతకుమించిన కంటెంట్‌తో ముందుకు వస్తామని తెలిపింది. అప్పటివరకూ ఎవరి పనులు వాళ్లు చూసుకుంటే బెటర్ అన్నట్టుగా చార్మీ ట్వీట్ చేసింది. అయితే.. ఈ ట్వీట్ చాలా గందరగోళంగా ఉండటంతో, చార్మీ ఏం చెప్పాలనుకుందో స్పష్టత లేకుండా పోయింది. కానీ, జన గణ మన మీద రూమర్స్ వస్తున్న సమయంలోనే రియాక్ట్ అయ్యింది కాబట్టి, ఆ సినిమా ఆగిపోలేదన్న సంకేతాలు ఇచ్చినట్టుంది. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజుల వరకు ఆగాల్సిందే!

కాగా.. ఇంకా లైగర్ విడుదల కాకముందే ఈ ఏడాది మార్చి చివర్లో ‘జన గణ మన’ సినిమాను అనౌన్స్ చేశారు. ఆ మరుసటి రోజు ప్రెస్‌మీట్ నిర్వహించి, సినిమా విశేషాల్ని వెల్లడించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు.. లైగర్ చిత్రాన్ని రిలీజ్ కాకముందే జూన్ 4వ తేదీన షూటింగ్ ప్రారంభించి, ఒక షెడ్యూల్‌ని కూడా పూర్తి చేశారు.

Show comments