అనుష్క నెక్స్ట్ మూవీ క్రేజీ హారర్ సీక్వెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నెక్స్ట్ మూవీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో తన రెండు సినిమాలు ఉండబోతున్నాయని అనుష్క సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కానీ ఈ ఏడాది చివరికి వచ్చినా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వారికి నిరాశే ఎదురయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క నెక్స్ట్ మూవీ క్రేజీ హారర్ సీక్వెల్. 2005లో విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేసిన “చంద్రముఖి” చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న “చంద్రముఖి-2″లో అనుష్క హీరోయిన్ గా నటించబోతోంది.
Read Also : నెక్స్ట్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
2005లో విడుదలైన “చంద్రముఖి”లో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక మరియు నయనతార కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. రజనీకాంత్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ మోహన్ లాల్, శోభన జంటగా నటించిన మలయాల సూపర్ హిట్ మూవీ “మణిచిత్రతజు”కి రీమేక్. ఈ మూవీ సీక్వెల్ లో రజనీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ నటించనున్నారు. దర్శకుడు పి వాసు మొదట సీక్వెల్ కోసం రజనీకాంత్‌ని సంప్రదించినట్టు ఊహాగానాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం డేట్స్ కాళీ లేకపోవడంతో రజినీ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయాడని సమాచారం.
ప్రస్తుతం “చంద్రముఖి-2″ను తెరకెక్కించడానికి దర్శకుడు పి వాసు సిద్ధంగా ఉన్నారు. రాఘవ లారెన్స్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మించబోతోంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానుంది. గత ఏడాది రాఘవ లారెన్స్ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాలో నటించడానికి తాను అందుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని కరోనావైరస్ సహాయక చర్యల కోసం విరాళంగా ఇచ్చినట్లు కూడా ఆయన వెల్లడించాడు.
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!