Nara Chandrababu: నందమూరి తారకరత్నకు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఇప్పటికీ ఆయన పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఐసీయూలో తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తారకరత్న తల్లిదండ్రులు శాంతి, మోహనకృష్ణ, భార్య రెడ్డి అలేఖ్య రెడ్డి, కూతురు నిషిత, నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వర్ రావు, పరిటాల శ్రీరామ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత అధినేత నారా చంద్రబాబు నాయుడు హాస్పిటల్ వద్దకు చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియా తో ఆయన మాట్లాడుతూ.. ” తారకరత్న యువగళం పాదయాత్రకు వచ్చారు. అక్కడ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స చేయించాం.. దేనికైనా మంచిది అని ఆయనను అక్కడి నుంచి బెంగుళూరుకు తరలించాం. అక్కడ కంటే కూడా ఇక్కడ బెటర్ గా వైద్యం చేస్తున్నారు. వైద్యులతో మాట్లాడాను.. ఇంకా గ్యాప్స్ ఉన్నాయని, అబ్జర్వేషన్ లో పెట్టారు. టైమ్ టూ టైమ్ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇవన్నీ చూసుకొని ఎలాంటి చికిత్స చేయాలో చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరగా ఆయన కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కోలుకుంటారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.