Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandan Anand: సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు ఎన్నో ఏళ్లుగా పనిచేసినా సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. కానీ ఒక్క సినిమా వారి కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు నటుడు చందన్ కే ఆనంద్ విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ‘హనుమాన్ అంశ్’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందన్ కే ఆనంద్ తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాన్స్టర్’ సినిమాలో తాను కూడా నటిస్తున్నట్లు చెప్పారు. తన పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమని చందన్ తెలిపారు. ఈ అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
ఇక షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమాలో కూడా తాను నటించినట్లు చందన్ వెల్లడించారు. ఈ అవకాశం ఇచ్చిన ‘కింగ్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంటే ‘హనుమాన్ అంశ్’ లో కనిపించిన చందన్ ఆనంద్ ఇకపై ఒకేసారి బాలీవుడ్‌లోని ఇద్దరు టాప్ స్టార్స్ సినిమాల్లో కనిపించబోతున్నారన్నమాట. సల్మాన్, షారుఖ్‌లతో కలిసి పనిచేయడంపై కూడా చందన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను సల్మాన్‌తో కలిసి పనిచేస్తున్న విషయం చూసి తన తండ్రి ఎంతో సంతోషించారని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. చందన్ ఆనంద్‌కు ఈ స్థాయిలో అవకాశాలు రావడం వెనుక ఆయన దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రయాణం ఉంది. సినిమాలు, టెలివిజన్‌లో చాలా కాలంగా పనిచేస్తున్న ఆయన ‘చైన్ కులీ కి మైన్ కులీ’లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ‘ఫైటర్’, ‘దేవా’, ‘హోమ్‌బౌండ్’ వంటి సినిమాల్లోనూ నటించారు. ‘క్లాస్’ వంటి వెబ్ సిరీస్‌లతో కూడా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
అయితే ఇన్ని సినిమాలు, సిరీస్‌లు చేసినా చందన్‌కు మంచి గుర్తింపు మాత్రం ‘హనుమాన్ అంశ్’ తోనే వచ్చింది. ఈ సినిమాలో రామ్ నందన్ భోసలే పాత్రలో నటించిన చందన్‌కు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు దక్కింది. సినిమా విజయం తర్వాత ఆయనకు వరుసగా పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ‘మాన్స్టర్’, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ వంటి భారీ చిత్రాల్లో భాగమైన చందన్ ఆనంద్‌కు ఇకపై మరిన్ని పెద్ద అవకాశాలు రావడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 20 ఏళ్లుగా కొనసాగిన ప్రయాణంలో ఆలస్యంగా వచ్చిన ఈ గుర్తింపు ఇప్పుడు ఆయన కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.
- Tags
- cinema
- Hanuman Ansh
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..