Spirit : స్పిరిట్ లో ప్రభాస్ తో నటించే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

  • మేల్ యాక్టర్స్ కోసం సెర్చింగ్
  • ప్రభాస్ తో నటించే గోల్డెన్ ఛాన్స్
  • వెంటనే అప్లై చేయండి
Spirit

Spirit

Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ స్పిరిట్. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీపిక పదుకొణెను పక్కన పెట్టేసి త్రిప్తి డిమ్రినీ హీరోయిన్ గా తీసుకున్నాడు సందీప్. చాలా నెలలుగా మూవీ షూటింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు సందీప్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ బంపర్ ఛాన్స్ ఇచ్చాడు. స్పిరిట్ లో ప్రభాస్ తో నటించేందుకు యాక్టర్ల కోసం వెతుకుతున్నాడు. తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది మూవీ టీమ్. ఈ సినిమా కోసం మేల్ యాక్టర్స్ కావాలని.. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి ఛాన్స్ ఇస్తామని తెలిపింది.

Read Also : Akira Nandan : పవన్ కొడుకు అకీరాతో సినిమా.. స్పందించిన నిర్మాత

ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు మూడు ఫొటోలు, రెండు నిముషాల యాక్టింగ్ వీడియోతో పాటు డీటేయిల్స్ ను spirit.bhadrakali pictures@gmail. com కు మెయిల్ చేయాలని కోరింది. అలాగే 7075770364 నెంబర్ కు కాల్ చేయొచ్చని కోరింది. ఇంకెందుకు లేటు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ అందరికీ రాదు. పైగా ప్రభాస్ తో సినిమా. అయితే ఈ పాత్ర కోసం షార్ట్ హెయిర్ కట్ మెయింటేన్ చేయాల్సి ఉంటుందని తెలిపింది టీమ్. చూస్తుంటే ఇది ప్రభాస్ యంగ్ ఏజ్ లుక్ లాగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది యాక్టర్స్ ను తీసుకున్న టీమ్.. ఇప్పుడు ఈ యంగ్ మేల్ రోల్ కోసం ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చిందంటే.. ఆ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.

Read Also : Rahul Gandhi: ఓటర్ల జాబితా చూపించడానికి ఈసీకి ఇబ్బందేంటి?