Site icon NTV Telugu

రొమాంటిక్‌గా ‘ఛ‌లో ప్రేమిద్దాం’…

యూత్ ఫుల్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఆ ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా వస్తున్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. అలా రాబోతున్న సినిమాల్లో ఛ‌లో ప్రేమిద్దాం కూడా ఒక‌టిగా నిలుస్తుంద‌ని నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. వ‌రుణ్ సందేశ్‌తో ప్రియుడు లాంటి ల‌వ్ ఓరియంటెడ్ సినిమా నిర్మించిన ఉద‌య్ కిర‌ణ్ మాదిరిగానే ఛ‌లో ప్రేమిద్దాం సినిమాను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాయి రోన‌క్‌, నేహా సోలంకి జంట‌గా న‌టించిన ఈ సినిమా ఈనెల 19 వ తేదీన రిలీజ్ కాబోతున్న‌ది.

ల‌వ్ స్టోరీతో పాటుగా థ్రిల్ల‌ర్ నేప‌థ్యంగా సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు ద‌ర్శ‌కుడు సురేష్ శేఖ‌ర్ తెలిపారు. కుటుంబ ప్రేక్ష‌కులు చూసేలా ఎక్క‌డా ఇబ్బంది లేకుండా సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 200కు పైగా థియేటర్ లలో ఛ‌లో ప్రేమిద్దాం రిలీజ్ కాబోతున్న‌ట్టు నిర్మాత తెలియ‌జేశారు. ఇప్ప‌టికే రిలీజైన సాంగ్స్ ప్ర‌జార‌ణ పొందిన‌ట్టు సంగీత ద‌ర్శకుడు భీమ్స్ తెలిపారు. రీసెంట్‌గా రిలీజైన ఎంసీఏ, ఎంబీఏ సాంగ్ కు సూప‌ర్ రెస్పాన్స్ వస్తున్న‌ట్టు భీమ్స్ పేర్కొన్నారు.

Exit mobile version