ఎట్టకేలకు అనుష్క శర్మ మళ్లీ బిగ్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమయ్యింది. 2018 చిత్రం ‘జీరో’లో చివరిగా కనిపించిన ఈ బ్యూటీ తన తదుపరి చిత్రం “చక్దా ఎక్స్‌ప్రెస్”లో నటించబోతోంది. భారత మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుష్క టైటిల్ రోల్ పోషిస్తోంది .
తాజాగా “చక్దా ఎక్స్‌ప్రెస్” నుంచి ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది అనుష్క. ఈ మేరకు చిన్న టీజర్‌ను పంచుకుంటూ ఇది తనకు ప్రత్యేకమైన చిత్రం అని అనుష్క సుదీర్ఘ గమనిక రాసింది. జులన్ క్రికెటర్‌గా మారాలని, దేశం గర్వపడేలా చేయాలని నిర్ణయించుకున్న సమయం గురించి ఈ చిత్ర కథ ఉంటుంది.
Read Also : ఏఆర్ రెహమాన్ అసలు పేరు తెలుసా ? 10 ఆసక్తికర విషయాలు
“చక్దా ఎక్స్‌ప్రెస్”లో జులన్ జీవితాన్ని, మహిళలకు క్రికెట్ పై ఆసక్తి ఉన్నప్పటికీ ఎలా తిరస్కారానికి గురయ్యారో అనే విషయాన్ని ఇందులో చెబుతున్నట్టు అనుష్క రాసింది. జులన్ పోరాటపటిమ, ఆమె అత్యంత అనిశ్చిత క్రికెట్ కెరీర్ గురించి కూడా అనుష్క ప్రస్తావించింది. “భారతదేశంలో క్రికెట్ ఆడటం ద్వారా మహిళలకు కెరీర్ ఉండదనే మూస పద్ధతిని మార్చడానికి ఆమె కృషి చేసింది. ఆమె వల్ల తరువాతి తరం అమ్మాయిలకు క్రికెట్ లో మెరుగైన కెరీర్ ఏర్పడింది” అని పోస్ట్ చేసింది అనుష్క. “చక్దా ఎక్స్‌ప్రెస్” అనుష్క శర్మ తన కుమార్తె వామిక పుట్టిన తర్వాత చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇది. ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
