NTV Telugu Site icon

HIT 2: బాలయ్య లక్కీ డేట్ లో శేష్ హిట్ కొడతాడా?

Hit 2

Hit 2

అడవి శేష్ నటిస్తున్న ‘హిట్ 2 : ది సెకండ్ కేస్’ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ డిసెంబర్ 2న ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి సిద్ధమయ్యారు. గతేడాది ఇదే డిసెంబర్ 2న బాలయ్య , బోయపాటి కాంబోలో ‘అఖండ’ సినిమా విడుదలై దుమ్ములేపింది. ఈ చిత్రం దాదాపు రూ. 200 కోట్ల కలెక్షన్స్‌ను క్రాస్ చేసి, బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమా రిలీజ్ అయిన వారానికే ‘పుష్ప’ సినిమా వచ్చింది, ఆ నెక్స్ట్ వారానికే ‘శ్యామ్ సింగా రాయ్’ సినిమా రిలీజ్ అయ్యింది. ఒకే నెలలో మూడు పెద్ద సినిమాలు విడుదల కావడంతో అఖండ సినిమాకి థియేటర్స్ తగ్గి, కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. అయితే ఇప్పుడు ‘హిట్ 2’ మూవీ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం.

స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, క్రేజ్ ఉన్న సినిమాలేవీ డిసెంబర్ నెలలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా లేవు. చిరు, బాలయ్యలు తమ సినిమాలని సంక్రాంతి బరిలో నిలుపుతున్నారు కాబట్టి అడవి శేష్ కి డిసెంబర్ లో పెద్దగా పోటీ లేదు. సత్యదేవ్ నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా డిసెంబర్ 9న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీగా ఉంది కానీ ఇది లవ్ స్టొరీతో తెరకెక్కిన సినిమా కాబట్టి ‘హిట్ 2’కి పెద్దగా నష్టం కలిగే ఛాన్స్ లేదు. డిసెంబర్ థర్డ్ వీక్ లో మాత్రం శేష్ కి రెండు సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అందులో ఒకటి విశాల్ నటిస్తున్న ‘లాఠీ’, ఇంకొకటి నిఖిల్ నటిస్తున్న ’18 పేజస్’. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే ‘హిట్ 2’ సినిమాకి థియేటర్స్ తగ్గుతాయి. సో శేష్ అండ్ టీంకి డిసెంబర్ 2 నుంచి రెండు వరాల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో ‘హిట్ 2’ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. బిజినెస్ పరంగా చూస్తే, ‘హిట్ 2’ సినిమా 18 కోట్ల ప్రీరిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది అంటే రెండు వారాల్లో 20 కోట్లు రాబట్టగలిగితే ‘హిట్ 2’ సినిమా హిట్ అయినట్లే.

Show comments