సూపర్ స్టార్ మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ`బిజినెస్ మేన్’.ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.రేపు బుధవారం మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా `బిజినెస్ మేన్` సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది. గత రికార్డుల ను అన్నీంటిని బ్రేక్ చేస్తుంది. ఈ సినిమా రేపు ఏకంగా సుమారు రెండు వేల థియేటర్లలో విడుదల కాబోతుంది.అంతేకాదు.. ఇప్పటి వరకు అత్యధికంగా అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న మూవీ గా నిలిచింది. రీ రిలీజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ లో `బిజినెస్ మేన్` ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు వంటి నగరాలలో ఈ సినిమా గత రికార్డులను బ్రేక్ చేసింది.
ఇక హైదరాబాద్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఇప్పటికే దాదాపు కోటిన్నర వచ్చినట్లు సమాచారం.ఇలా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో టాప్‌లో ఉంది. దీంతో `బిజినెస్ మేన్` మొదటి రోజు గత సినిమాల రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.. రీ రిలీజ్ సినిమాలలో గతంలో నెలకొన్న రికార్డులను బ్రేక్ చేయాలని మహేష్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే ఈ చిత్రాన్ని భారీగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.మరోవైపు ఈ సినిమా థియేటర్ల వద్ద చాలా చోట్ల మహేష్ బాబు కటౌట్‌ల తో నిండిపోయాయి.. అందులో ప్రధానంగా హైదరాబాద్ లో సుదర్శన్ థియేటర్ అలాగే విశ్వనాథ్ థియేటర్ల వద్ద భారీ కటౌట్లు వెలిశాయి. రేపు సూపర్ స్టార్ మహేష్‌బాబు తన 48 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.. ఈ సందర్బంగా `బిజినెస్ మేన్`సినిమా ని రీ రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.