Site icon NTV Telugu

The Warriorr : “బుల్లెట్” సాంగ్ కు అదిరే రెస్పాన్స్

Bullet Song

Bullet Song

లింగుస్వామి డైరెక్షన్ లో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ది వారియర్’. జూలై 14న విడుదల కాబోతున్న ‘ది వారియర్’లో కృతిశెట్టి హీరోయిన్ కాగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన “బుల్లెట్” సాంగ్ కు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ ను కోలీవుడ్ స్టార్ హీరో శింబు తెలుగు, తమిళ భాషల్లో పాడడం విశేషం. డీఎస్పీ సంగీతం అందించిన ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే 3.5 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తోంది.

Read Also : Ram Charan : నడిచే నేల, పీల్చే గాలీ, బతుకుతున్న దేశం వారి త్యాగమే !

కలర్ ఫుల్ గా సాగిన “బుల్లెట్” సాంగ్ లిరికల్ వీడియోలో రామ్, కృతి వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శింబుతో పాటు యూఏఈ సాంగ్ ను లేడీ సింగర్ హరిప్రియ పాడారు. శ్రీమణి అందించిన లిరిక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. సాంగ్ తోనే ‘ది వారియర్’పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో రామ్ మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version