Site icon NTV Telugu

‘ఉప్పెన’ డైరెక్టర్ కి లైన్ క్లియర్ అయినట్టే..?

ntr

ntr

ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడిగా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ రెండవ చిత్రమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన విషయం విదితమే. ఆర్ఆర్ఆర్ పోస్టుపోన్ కావడంతో దాన్ని పక్కన పెట్టేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో రెండో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇది కాకుండా తమిళ్ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమాను చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బుచ్చిబాబు సినిమా లైన్లో పడిపోయింది. ఈ రెండు సినిమాలను ఎన్టీఆర్ పూర్తి చేసి బుచ్చిబాబు దగ్గరకు రావాలి. అందుకే ప్రస్తుతం బుచ్చిబాబు అవుట్ ఫోకస్ లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి అట్లీ- ఎన్టీఆర్ ప్రాజెక్టు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

అట్లీ ఇదే కథను, ఎన్టీఆర్ కి, అల్లు అర్జున్ కి చెప్పారని, డేట్స్ ఎవరు ముందుగా ఇస్తే వారితోనే ప్రాజెక్ట్ చేయనునున్నాడట. అయితే ఈ ఇద్దరు హీరోల్లో ముందు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. దీంతో అట్లీ కుమార్ – ఎన్టీఆర్ మూవీ కి బ్రేక్ పడింది.ఇక దీంతో బుచ్చిబాబుకు లైన్ క్లియర్ అయినట్టే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. త్వరలోనే కొరటాల శివ- ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం, ఈ సినిమా తరువాత బుచ్చిబాబు పంట పండడం జరిగిపోతాయని తెలుస్తోంది. మరి ఈసారి బుచ్చిబాబు.. ఎన్టీఆర్ ని ఏ విధంగా చూపిస్తాడో చూడాలి మరి.

Exit mobile version