NTV Telugu Site icon

Breath Trailer: నందమూరి వారసుడు.. అదరగొట్టాడు

Brath

Brath

Breath Trailer: నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో నందమూరి చైతన్య కృష్ణ. అతను నటిస్తున్న చిత్రం బ్రీత్. . వంశీకృష్ణ ఆకెళ్ల‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను దివంగ‌త ఎన్టీఆర్ మొద‌టి కొడుకు జ‌య‌కృష్ణ నిర్మిస్తోన్నారు. ర‌క్ష‌, జ‌క్క‌న సినిమాలతో వంశీ కృష్ణ తనకో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ మొత్తం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను బట్టి ఇది మెడికల్ మాఫియాకు సంబంధించిన సినిమాగా తెలుస్తోంది. ఇందులో చైతన్యకృష్ణ ఒక హాస్పిటల్ లో పేషేంట్ లా కనిపించాడు. ఒంటినిండా దెబ్బలతో చైతన్య దేనికోసమో పోరాడుతున్నట్లు కనిపించాడు.

Pindam: సినిమా మొదలుపెట్టగానే.. అమ్మ చనిపోయింది.. వింత సంఘటనలు.. ప్యాంట్ తడవడం ఖాయం

ఒక తెలంగాణ మంత్రి హఠాత్తుగా కళ్ళుతిరిగి పడిపోవడం.. అతడిని హాస్పిటల్ ను తీసుకెళ్లడం.. అక్కడనుంచి ఆ హాస్పిటల్ మొత్తాన్ని చైతన్యకృష్ణ తన కమాండ్ లోకి తీసుకోవడం కనిపించింది. అసలు ఈ మెడికల్ మాఫియా ఏంటి.. ? దాన్ని చైతన్యకృష్ణ ఎలా ఆపాడు .. ? అనేది సినిమాకథగా తెలుస్తోంది. ఇక నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ తమదైన నటనతో అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు అందులో చైతన్య కృష్ణ కూడా జాయిన్ అవుతున్నాడు. అప్పట్లో ఇతను ఒక రెండు సినిమాల్లో నటించాడు.. కానీ, ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో చైతన్యకృష్ణ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments