పిచ్చి పలు రకాలు అంటారు పెద్దలు.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కొందరికి డబ్బు పిచ్చి, ఇంకొందరికి అమ్మాయిల పిచ్చి, ఇంకొందరికి సినిమా పిచ్చి.. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక మోడల్ కి భార్యల పిచ్చి. ఒక్క బార్యతోనే వేగలేక చస్తున్నాం అంటూ పెళ్ళైన వారు గగ్గోలు పెడుతుంటే ఇతగాడు మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 9 మందిని వివాహం చేసుకున్నాడు. అది కూడా ఆ 9 మంది అంగీకారంతోనే.. దేవుడా వీడెవడండీ బాబు అనుకుంటున్నారా.. బ్రెజిల్ కు చెందిన మోడల్ ఆర్థర్ ఓ ఉర్సో .. గత కొన్ని రోజుల క్రితం ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది. ఎందుకంటే.. తాను చేసుకున్న 9 మంది భార్యలతో కలిసి గురుడు సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అదికాస్తా వైరల్ అవ్వడం.. దీంతో మనోడు ఫేమస్ అవ్వడం జరిగిపోయాయి.
అయితే తాజాగా మరోసారి ఆర్ధర్ వార్తల్లో నిలిచాడు. ఇప్పటివరకు 9 మంది భార్యలతో అన్యోన్యంగా ఉన్న అతడికి ఒక భార్య షాక్ ఇచ్చింది. ఉర్సో నుంచి విడాకులు కోరిందట.. ఆమె ఏకస్వామ్య సంబంధాన్ని కోరుకుంటుందని , తనకు అలంటి ఉద్దేశ్యం లేకపోవడంతో ఆమెకు విడాకులు ఇచ్చానని చెప్పి మరోసారి షాక్ ఇచ్చాడు. అంతేకాకుండా తన జీవితంలో 10 మంది భార్యలు ఉండాలని కోరుకుంటున్నానని, త్వరలోనే ఇంకో రెండు పెళ్లిళ్లు చేసుకొని ఆ కోరిక తీర్చుకోవాలని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వార్తపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పిచ్చి పలురకాలు అని అనడంలో తప్పులేదు అని కామెంట్స్ చేస్తున్నారు.