NTV Telugu Site icon

Lust Stories 2: తమన్నా- విజయ్ వర్మల లస్ట్ స్టోరీ.. బెడ్ పై ముద్దులు..

Lust

Lust

Lust Stories 2: బాలీవుడ్ లో శృంగార సినిమాలకు కొదువేం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడడం అనేది అప్పట్లో తప్పుగా ఉన్నా .. ఇప్పుడు మాత్రం ఫ్యాషన్ గా మారిపోయింది. ఇక అమ్మాయిల శృంగార కోరికలు .. మనసు చంపుకొని ఇష్టం లేకుండా.. మూడ్ లేకుండా భర్తతో శృంగారం చేయడం అన్ని ఇళ్లలో ఉండేవే కానీ, బయటికి వచ్చేవి కొన్నే. ఆ కథలనే ఏరి.. లస్ట్ స్టోరీస్ గా ప్రెజెంట్ చేశారు బాలీవుడ్ మేకర్స్. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్, మనీషా కొయిరాలా లాంటి స్టార్ కాస్టింగ్ లో నలుగురు స్టార్ డైరెక్టర్లు ఈ సినిమాను తెరకెక్కించారు. 2018లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో నాలుగు స్టోరీలు ఉంటాయి. ఒక్కోస్టోరీని ఒక్కో డైరెక్టర్ తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద సంచలానాన్నే సృష్టించింది. అడల్డ్ కంటెంట్ గా వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ను ప్రకటించారు మేకర్స్. పార్ట్ 1 లానే.. పార్ట్ కూడా నాలుగు స్టోరీలు.. 9 మంది స్టార్లు.. నలుగురు డైరెక్టర్లు.. ఇక ఈసారి అంతకుమించి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Anupama Parameswaran: అందుకే అనుపమ అలాంటి పని చేస్తుందా?

కాజోల్, తమన్నా, మృణాల్ ఠాకూర్, నీనా గుప్తా, అమృత సుభాష్, విజయ్ వర్మ, లాంటి స్టార్లు ఇందులో నటిస్తున్నారు. ఇక ఈ స్టోరీస్ కు ఆర్. బాల్కి, కొంకణా సేన్ శర్మ, సుజయ్ ఘోష్, అమిత్ ఆర్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ క్యాస్టింగ్ చూస్తుంటేనే సగం హిట్ అయిపోయిందని చెప్పొచ్చు. కాజోల్, తమన్నా అందాలు అయితే ప్రేక్షకులకు కన్నుల పండుగే. ఇక రూమర్ ప్రేమికులు తమన్నా, విజయ్ వర్మ .. ఇందులో జంటగా కనిపిస్తున్నారు. దీంతో సినిమాకు బీభత్సమైన హైప్ వచ్చేసిందనే చెప్పాలి. తమ్ము- విజయ్ మధ్య బెడ్ సీన్స్.. హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.