Brahmastra: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఛేంజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో దీన్ని ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాణ సంస్థలు స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ఫ్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ భారీగా సన్నాహాలు చేస్తున్నాయి. దక్షిణాది భాషలకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్మాతలు జరపాలనుకున్నారు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీయార్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్టుగానూ ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో పర్మిషన్ లేని కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిల్మ్ సిటీ దగ్గర నుండి నగరంలోని ఓ స్టార్ హోటల్ కు మార్చినట్టు సమాచారం.
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
వెన్యూ ఛేంజ్ కు ఇదే కారణమా!?
ఫిల్మ్ సిటీ వెలుపల ఖాళీ స్థలంలో అభిమానుల మధ్య ‘బ్రహ్మాస్త్రం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు. అయితే అక్కడ ఉన్న సదుపాయాలు, అభిమానులను కట్టడి చేసే విషయంలోనూ పోలీసులకు, ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియాకు మధ్య నగదు లావాదేవీలలో తేడా రావడంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్టు అనధికారంగా అందుతున్న సమాచారం. దాంతో చివరి నిమిషంలో జరిగిన ఈ మార్పుతో ఈవెంట్ ఏ సమయానికి ఆరంభమౌతుందో చూడాలి మరి!
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!