Site icon NTV Telugu

HHVM : పవన్ కల్యాణ్‌ ఎవరి దారిలో నడవడు.. బ్రహ్మానందం కామెంట్స్

Brahmanandam

Brahmanandam

HHVM : పవన్ కల్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకలా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు వచ్చిన బ్రహ్మానందం పవన్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్‌ ఎలాంటి వ్యక్తి అనేది నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాకు పవన్ కల్యాణ్‌ 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి చూస్తున్నాను. అతను ఎవరి దారిలో నడవడు. తాను నిర్ణయించుకున్న దారిలో ఎన్ని సమస్యలు వచ్చినా అందులోనే నడుస్తాడు. కష్టాలను దాటుకుని నిలబడి చూపిస్తాడు. అదే అతన్ని గొప్ప వ్యక్తిని చేసింది. పవన్ కల్యాణ్‌ నా దృష్టిలో తనను తాను చెక్కుకున్న శిల్పి అన్నారు బ్రహ్మానందం.

Read Also : MaheshBabu : కొలంబోకు మహేశ్ బాబు.. శ్రీలంక ఎయిర్ లైన్స్ ట్వీట్..

పవన్ కల్యాణ్‌ సినిమాల్లోకి వస్తాడని మేం అనుకోలేదు. ఎవరితోనూ మాట్లాడడు ఇతను హీరో అవుతాడా అనుకున్నాం. కానీ సినిమాల్లోకి వచ్చి పెద్ద స్టార్ అయ్యాడు. అది అతని డెస్టినీ. రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాడు. పడి లేచిన కెరటంలా డిప్యూటీ సీఎం అయ్యాడు. హరిహర వీరమల్లు మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ ఒక శివుడి చేతిలోని త్రిశూలంలా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ తెలిపాడు బ్రహ్మానందం.

Read Also : Prabhas : ప్రభాస్ కు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Exit mobile version