Site icon NTV Telugu

Brahmanandam : తప్పుగా అర్థం చేసుకున్నారు.. కాంట్రవర్సీపై బ్రహ్మానందం క్లారిటీ

Brahmi

Brahmi

Brahmanandam : బ్రహ్మానందం మీద నిన్నటి నుంచి ఒక కాంట్రవర్సీ మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో నడుస్తోంది. మంచు మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కు బ్రహ్మానందం వెళ్లారు. అయితే బీఆర్ ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈవెంట్ లో బ్రహ్మానందం ను కలిశారు. ఒక ఫొటో దిగుదాం రా అన్నా అంటూ బ్రహ్మానందం చేతు పట్టుకుని అడుగుతున్నా.. ఏ వద్దు ఇప్పుడు అంటూ బ్రహ్మానందం వెళ్లిపోయారు. దీంతో ఈ వీడియో కాస్త వివాదానికి దారి తీసింది. బ్రహ్మానందం ఒక మాజీ మంత్రిని అవమానించాడు అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. బ్రహ్మానందం ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read Also : Mana Shankara Varaprasad Garu : అనిల్ రావిపూడి బర్త్ డే స్పెషల్.. చిరు సందడి చూశారా

ఈ వివాదంపై తాజాగా బ్రహ్మానందం స్పందించారు. ‘నేను, దయాకర్ రావు 30 ఏళ్ల నుంచి మంచి మిత్రులం. తరచూ కలుస్తూనే ఉంటాం. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా కలిసి ఉంటాం. ఆయనకు, నాకు ఎంతో చనువు ఉంది. మొన్న ఈవెంట్ లో కలిసినప్పుడు నాకు ఆలస్యం అయిపోతుందని.. ఇప్పుడు ఫొటో వద్దు అన్నట్టు నేను వెళ్లిపోయాను. అంతే గానీ అందులో ఎలాంటి వేరే ఉద్దేశం లేదు. దాన్ని మీడియా వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. పొద్దున్నే ఆ వీడియోల మీద వస్తున్న న్యూస్, మీమ్స్ చూసి కొంచెం సేపు నవ్వుకున్నాను. దయన్నతో కూడా ఈ విషయంపై మాట్లాడితే ఇద్దరం కాసేపు నవ్వుకున్నాం. ఇందులో మీకు క్లారిటీ ఇవ్వాలని, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఈ వీడియో చేస్తున్నాను’ అంటూ తెలిపారు బ్రహ్మానందం.

Read Also : iBomma Ravi : 15 రోజులకో టూర్.. లగ్జరీ లైఫ్‌.. రవి లైఫ్ స్టైల్ ఇదే

Exit mobile version