Brahmaji Son Sanjay Rrao Movie Guttu Chappudu Teaser : బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్ హీరోగా హ్యాపెనింగ్ భామ ఆయేషాఖాన్ హీరోయిన్ గా, మణీంద్రన్ దర్శకత్వంలో డా॥ లివింగ్‌స్టన్ నిర్మిస్తున్న రొమాంటిక్ మాస్ యాక్షన్ లవ్, ఎంటర్‌టైనర్ ‘గుట్టు చప్పుడు’. హనుమేన్ చిత్రంతో పాన్ ఇండియా సంగీత దర్శకుడిగా మారిన గౌర హరి సంగీత సారధ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా సుప్రీం హీరో సాయి తేజ్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. అనంతరం ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ నటులు బ్రహ్మాజీ తన చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక ఈ టీజర్ కట్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. వైజాగ్ నేపథ్యంలో ఒక క్రైమ్ వరల్డ్ చుట్టూ కథ అల్లినట్టు అనిపిస్తోంది. ఇక అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో బ్రహ్మాజీ మాట్లాడుతూ టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ చేస్తున్నారని, ఇప్పటికే చాలా వరకూ పూర్తయినట్టు ఉందని అన్నారు.
Aa Okkati Adakku: పెళ్లి కాని వాళ్ళ పెయిన్ ఫీలయ్యి సినిమా చేశా.. డైరెక్టర్ ఇంటర్వ్యూ
మా అబ్బాయి నటిస్తున్న 3వ సినిమా ఇది, మంచి నిర్మాత, టెక్నీషియన్స్‌ను కుదిరారు, భారీ బడ్జెట్‌తో తీశారని అన్నారు. టీజర్ చూసిన తర్వాత సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడిరది, ఇందులో ఎందుకో గానీ నాకు మాత్రం క్యారెక్టర్ ఇవ్వలేదని అన్నారు. ఇక సంగీత దర్శకుడు గౌర హరి మాట్లాడుతూ నేను మండుటెండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ప్రయాణం మొదలు పెట్టిన తరుణంలో ఈ సినిమా నాకు చెప్పులు దొరికినట్లు దొరికిన అద్భుత అవకాశం, మణీంద్రన్ నన్ను చాలా నమ్మారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయలేదని భావిస్తున్నా. సినిమాలో మంచి కంటెంట్ ఉంది, సంగీతానికి మంచి స్కోప్ ఉండేలా దర్శకుడు కథను రాసుకోవడం నాకు బాగా ప్లస్ అయ్యింది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు.