ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఒక సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వగానే… ఇదో రేర్ కాంబినేషన్, ఎలాంటి సినిమా బయటకి వస్తుందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేశారు. #BoyapatiRapo అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి రామ్ పోతినేని బర్త్ డే సంధర్భంగా ఫస్ట్ థండర్ ని రిలీజ్ చేశారు. ఎలాంటి డౌట్స్ లేకుండా పక్కాగా బోయపాటి స్టైల్ లో ఊరమాస్ గానే ఈ సినిమా ఉంటుంది అని కన్ఫామ్ చేస్తూ ఈ గ్లిమ్ప్స్ బయటకి వచ్చింది. ఎప్పుడూ స్లిమ్ అండ్ క్యూట్ గా ఉండే రామ్, పూర్తిగా బోయపాటి హీరోలా మారిపోయి గడ్డం పెంచి మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇలాంటి ఒక లుక్ ని రామ్ పోతినేని చూస్తాం అని ఫాన్స్ ఏ రోజు అనుకోని ఉండరు. లుక్స్ విషయంలోనే కాదు రామ్ పోతినేని డైలాగ్స్ విషయంలో కూడా బోయపాటి స్టైల్ నే ఫాలో అయిపోయాడు. “నీ స్టేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ గేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ పవర్ దాటలేను అన్నావ్ డాటా, ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్” అని రామ్ పోతినేని డైలాగ్ చెప్తుంటే భద్ర సినిమాలో రవితేజ, తులసి సినిమాలో వెంకటేష్, సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ లు గుర్తొస్తున్నారు.
ఈ ముగ్గురూ బోయపాటి స్టైల్ లోకి మారి మంచి హిట్స్ అందుకున్న వాళ్ళే. రామ్ పోతినేని, బోయపాటి శ్రీనుని కంప్లీట్ గా ట్రస్ట్ చేసి అతనికి తగ్గట్లు మారిపోయాడు. సదర్ పండగ లాంటి సెటప్ లో దున్నపోతుని తీసుకోని రామ్ పోతినేని నడుచుకుంటే వచ్చే బ్లాక్, ఆ సీన్ లో చూపించిన యాక్షన్ ఎపిసోడ్ ఫస్ట్ థండర్ కే హైలైట్ గా నిలిచాయి. శ్రీలీలా లైట్ గా అలా కనిపించి వెళ్లిపోయింది. ఇక ఫస్ట్ థండర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది తమన్ ఇచ్చిన థంపింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సీన్ ని ఎలివేట్ చేసేలా తమన్ మంచి బీజీఎమ్ ఇచ్చాడు. ఓవరాల్ గా #BoyapatiRapo ఫస్ట్ థండర్ తోనే బౌండరీలు దాటేసి మాస్ కాదు ఊరమాస్ సినిమా చూపించడానికి రెడీ అయ్యారు. మరి అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
Mass Madness is HIGH, Rampage is High & #BoyapatiRAPO is High❤️🔥🤙
𝐅𝐢𝐫𝐬𝐭 𝐓𝐡𝐮𝐧𝐝𝐞𝐫 Blasted⚡💥
▶️ https://t.co/B1grY6fx4z#BoyapatiRAPOonOct20 #HappyBirthdayRAPO@ramsayz #BoyapatiSreenu @sreeleela14 @MusicThaman @srinivasaaoffl @detakesantosh @StunShiva8 @SS_Screens… pic.twitter.com/roy1yy8aXT
— Srinivasaa Silver Screen (@SS_Screens) May 15, 2023