Sridevi:అందాల అతిలోక సుందరి శ్రీదేవి జీవితం తెరిచిన పుస్తకమని అందరికి తెలుసు. ఆమె బాలనటి నుంచి కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగిన వైనం, ఇండస్ట్రీని ఏలిన విధానం, ప్రేమలు, బ్రేకప్, పెళ్లి, పిల్లలు, వివాదాలు, విమర్శలు అన్ని .. అన్ని అభిమానులు పూస గుచ్చినట్లు చెప్తారు. అలాగే ఆమె మరణం కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్ లో శ్రీదేవి బాత్ టబ్ లో కళ్ళు తిరిగి పడిపోవడం వలన మృతిచెందింది అని అధికారికంగా ప్రకటించినా కూడా అభిమానుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అవి ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఇక తాజాగా బోనీ కపూర్ ఈ విషయాలు బయటపెట్టినా కూడా నమ్మనివారు చాలామందే ఉన్నారు. కేవలం శ్రీదేవి మరణం గురించే కాదు.. జాన్వీ జననం గురించి కూడా బోనీ మాట్లాడాడు. శ్రీదేవి పెళ్ళికి ముందే తల్లి అయ్యిందని.. అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం టాక్ నడిచింది. జాన్వీ కపూర్ కడుపులో ఉండగానే బోనీ.. శ్రీదేవిని వివాహమాడాడని రూమర్స్. ఆ పుకార్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయమై కూడా బోనీ మాట్లాడాడు.
The Grate Indian Suicide Trailer: చనిపోయినవాడిని బతికించడానికి మాస్ సూసైడ్.. ఆరుగురు ఒకేసారి
“జాన్వీ జననం గురించి కూడా ఇప్పటికీ రూమర్స్ నడుస్తున్నాయి. మా పెళ్ళికి ముందే జాన్వీ పుట్టిందని ఎన్నో పుకార్లు వచ్చాయి. అసలు నిజం ఏంటంటే.. నేను, శ్రీదేవి.. 1996లో షిర్డిలో సీక్రెట్ గా వివాహం చేసుకున్నాం. ఈ విషయం ఎవరికి తెలియకూడదని అనుకున్నాం. అయితే కొన్ని కారణాల వలన కొద్దినెలలకే అందరికి చెప్పాం. 1997 జనవరిలో అందరి సమక్షంలో మేము మరోసారి పెళ్లి చేసుకున్నాం. అదే ఏడాది మార్చిలో జాన్వీ పుట్టింది. అది నిజం. అయినా ఈ విషయం ఎవరు నమ్మరు. చివరికి నేను చెప్పినా కూడా ఈ రూమర్స్ ను ఆపలేను” అని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా జాన్వీ కపూర్ జన్మ రహస్యం ఇప్పటికైనా తెలిసిందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.