Prabhas : ఈ రోజుల్లో చిన్నస్థాయి సెలబ్రిటీలు కూడా ఇష్టం వచ్చినట్టు యాడ్స్ లలో నటిస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లో నటిస్తే చాలు సినిమాల్లో వచ్చినంత డబ్బు వచ్చేస్తుంది. అందుకే ప్రకటనలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు సెలబ్రిటీలు. మరి దారుణం ఏంటంటే బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే ఏకంగా పాన్ మసాలా, విమల్ లాంటి దిక్కుమాలిన ప్రకటనలో చేస్తుంటారు. జనాల ప్రాణాలను తీసే ఇలాంటి దరిద్రమైన యాడ్స్ లలో నటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తమను అభిమానించే వారి హెల్త్ ను ఇలాంటి ప్రకటనలతో పాడు చేస్తూ డబ్బు సంపాదించుకోవడంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. వేల కోట్లు ఉన్నా సరే బాలీవుడ్ సెలబ్రిటీలు ఇలాంటి చెడు చేసే యాడ్స్ లలో నటించడం మాత్రం మానట్లేదు. కానీ అదే ప్రభాస్ విషయానికి వస్తే తాను నమ్మిన దానికోసం, తనను నమ్మిన అభిమానుల కోసం ఎలాంటి యాడ్స్ లలో నటించకుండా వందల కోట్లు వదులుకుంటున్నాడు.
Read Also : Priyanka Chopra : నల్లగా ఉన్నావంటూ బాడీ షేమింగ్ చేశారు.. మహేశ్ హీరోయిన్ కామెంట్స్
వాస్తవానికి ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ లలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఆయన ఒక యాడ్ చేస్తే పది నుంచి 25 కోట్ల దాకా ఇచ్చేందుకు చాలా కంపెనీలు రెడీగా ఉన్నాయి. కానీ ప్రభాస్ మాత్రం అలా ఏది పడితే అది అస్సలు చేయడు. రీసెంట్ గానే తన దగ్గరకు ఓ కూల్ డ్రింక్ కంపెనీ యాడ్ వస్తే చేయనని చెప్పేశాడు. ఎందుకంటే అది గవర్నమెంట్ రూల్స్ కు విరుద్ధంగా ఉందని.. ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదనే ఉద్దేశంతో.. తన మీద ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని వద్దని చెప్పేశాడంట. ఇప్పుడే కాదు బాహుబలి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా ఎన్నో రకాల యాడ్స్ ను రిజెక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇప్పటివరకు కేవలం ఓ వెహికల్ కంపెనీకి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అంతకుమించి ఎలాంటి ప్రొడక్ట్స్ కు అతను బ్రాండ్ అంబాసిడర్ గా లేడు. కాబట్టి డబ్బులు లెక్క చేయకుండా నమ్మిన వారి కోసం ఇలా ఉండిపోతున్న ప్రభాస్ ను చూసి బాలీవుడ్ సెలబ్రిటీలు నేర్చుకోవాలని చెబుతున్నారు ప్రేక్షకులు.
Read Also : Baahubali The Epic : బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సెంథిల్